నగరం ఊగింది | The city was shaking | Sakshi
Sakshi News home page

నగరం ఊగింది

Published Sat, Jul 23 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

నగరం ఊగింది

నగరం ఊగింది

సాక్షి, సిటీబ్యూరో: ఒకరూ ఇద్దరూ కాదు పదుల సంఖ్యలో డీజేలు, భారీ వేదికలు, వేల వాట్ల సంగీతం.. వెరసి నగరవాసుల్ని కొత్త అనుభూతికి గురిచేశాయి. శనివారం రాత్రిని మెమరబుల్‌ నైట్‌గా మార్చాయి. ప్రపంచంలోనే భారీ మ్యూజికల్‌ షోగా ప్రసిద్ధి చెందిన ‘టుమారో ల్యాండ్‌ రిప్లికా’ ఈవెంట్‌ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా ఆహూతులను ఉర్రూతలూగించింది. మొత్తం 8 దేశాలతో ఏకకాలంలో అనుసంధానించిన ఈ ఈవెంట్‌కు సిటీజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

లాస్ట్‌ స్టోరీస్, అనీష్‌ సూద్, కేరనీ బీ2బీ, జోషి, కాండైస్‌ రెడ్డింగ్‌ విల్‌... తదితర టాప్‌ డీజేల లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ పూర్తయ్యాక.. బెల్జియంలోని బూమ్‌ సిటీ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమయ్యాయి. పైరో, సీఓ2 స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ను డైరెక్ట్‌గా బెల్జియంలోని ప్రధాన వేదికకు అనుసంధానించడం ద్వారా నిక్కీ రొమెరో, ఆఫ్రోజాక్, డిడిట్రీ వెగాస్, లైక్‌ మైక్‌.. వంటి అంతర్జాతీయ ప్రసిద్ధ డీజేల లైవ్‌ ట్రాక్స్‌ నగరవాసులకు వీనులవిందు చేశాయి.
                                                                                                                 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement