Live Tracks
-
ఏ బస్సు ఎక్కడుందో... ఎవరికెరుక!
ఉలవపాడు: కాలం మారింది.. ఇప్పుడు ప్రపంచం అంతా సెల్‌ఫోన్‌తోనే అంతా నడుస్తోంది. ఇలాంటి కాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన లైవ్‌ట్రాక్ అప్లికేషన్ ఏర్పాటు చేసింది. ఈ అప్లికేషన్‌ను అందరూ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. ప్రతి బస్‌స్టేషన్‌లో ఆర్టీసీకి సంబంధించిన వలంటీర్లు కూర్చునిఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారందరితో ఈ అప్లికేషన్ డౌన్ లోడ్ చేయించి పేర్లు, నంబర్లు రాసుకుని మరీ వెళ్లారు. ఇలా ఎక్కువ మందికి కి ఈ యాప్‌ను ఎక్కించి ఉపయోగంలోనికి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రయాణికులు అందరూ ఏ బస్సు ఎక్కడ ఉందో అని తెలుసుకోవడానికి ఈ అప్లికేషన్‌పైనే ఆధార పడుతున్నారు. తమ బస్సు ఎక్కడ ఉందో పరిశీలించుకుని ఆ సమయానికి బయలు దేరేవారు. తీరా అందరూ బాగా అలవాటయ్యాక ఈ యాప్ పనిచేయకుండా మొరాయిస్తోంది. గత 20 రోజులుగా అప్లికేషన్ ఓపెన్ చేయగానే సర్వీస్ తాత్కాలికంగా పని చేయడం లేదు. అసౌకర్యానికి చింతిస్తున్నాం అనే సందేశమే కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రయాణికులకు ఏ బస్సు ఎక్కడ ఉందో అర్థం కాక ప్రయాణాల సమయంలో అవస్థలు పడుతున్నారు. అప్డేట్ చేస్తే అసలుకే ఎసరొచ్చింది.. లైవ్ ట్రాక్ అప్లికేషన్ ద్వారా దగ్గర లో ఉన్న బస్‌స్టాప్ వివరాలు, బస్ నంబరుతో ఎక్కడ ఉందో తెలుసుకునే విధానం, రిజర్వేషన్ నంబరుతో బస్సు ఎక్కడ ఉందో చూసే విధానం, రెండు గ్రామాల మధ్య నడిచే సర్వీసులు వాటి సమయం తదితర వివరాలు లభించేవి. ఇవి కాక ఫిర్యాదులకు సంబం«ధించి నంబర్లు ఉండేవి. గత నెలలో ఈ యాప్‌ను అప్డేట్ చేయాలి అని వచ్చింది. పాత యాప్ ఓపెన్ చేసే అప్డేట్ అని వచ్చింది. అప్డేట్ అయిన తరువాత అసలే పని చేయకుండా పోయింది. గత 20 రోజులుగా ఈ యాప్ ద్వారా సేవలు లభించడం లేదు. ప్రయాణికుల ఇబ్బందులు.. ఈ అప్లికేషన్ పనిచేయని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌లో పైన సర్వర్ పని చేయడం లేదు అని చూపడం, బస్సు నంబర్ ఎంటర్ చేస్తే.. తప్పులు తడకగా వివరాలు చూపడం సర్వసాధారణంగా మారింది. రెండు గ్రామాల మధ్య సర్వీసు అసలు పని చేయడం లేదు. రిజర్వేషన్ ఆధారిత విచారణ కూడా పని చేయడం లేదు. కాల్ సెంటర్‌కు కాల్ చేసిన సమయంలో సర్వర్ పనిచేయడం లేదు. బాగు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పటిలోపు యాప్ అందుబాటులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సమస్యను త్వరిత గతిన పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
అరచేతిలో ఆర్టీసీ సమాచారం
మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్లాలనుకుంటున్నారా..? అలాగే మీరు వెళ్లే ఊరికి బస్సులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఆ బస్సు ఎక్కడుందో తెలుసుకోవాలా.. బస్సులో ఆకతాయిల వేధింపులా...? సమస్య ఏదైనా.. సమాచారం తెలుసుకోవాలన్నా చాలా సులువు. అదేంటో తెలుసుకుందామా..? సమస్యలపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా..? మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఆర్టీసీ సేవలన్నీ పొందే వెసులుబాటు ఉంది. ఆర్టీసీ లైవ్‌ట్రాక్ యాప్ ద్వారా ఆర్టీసీ సేవలు సులువుగా తెలుసుకోవచ్చు. ఆర్టీసీ లైవ్ ట్రాక్ యాప్ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణం కొనసాగించడానికి ఏపీఎస్ ఆర్టీసీ సాంకేతికతను వినియోగిస్తోంది. ఆర్టీసీ లైవ్ ట్రాక్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని సేవలు పొందే వీలు ఉంటుంది. దూర ప్రాంతాలకు టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవడానికి ఆర్టీసీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. దీంతో బస్ స్టాండ్లలో బారులు తీరాల్సిన బాధ తప్పుతుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి....? గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్ దగ్గరలోని బస్టాండు ఎక్కడ ఉందో జీపీఎస్ ద్వారా తెలియజేస్తుంది. ప్రారంభ, గమ్య స్థానాలను యాప్‌లో నమోదు చేయగానే రెండు ప్రదేశాల మధ్య ఎన్ని బస్సులు ఉన్నాయో? ఏ సమయానికి ఉన్నాయో? డ్రైవర్, కండక్టర్ వివరాలు అందులో కనిపిస్తాయి. రిజర్వేషన్ చేసుకున్న తర్వాత సర్వీసు నంబరు ఆధారంగా బస్సు ఎక్కడుందో యాప్ ద్వారా తెలిసిపోతుంది. మనకు కావాల్సిన బస్సు నంబరు యాప్‌లో నమోదు చేయగానే అది ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుస్తుంది. నిరీక్షణకు తెర గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు ఏ సమయానికి వస్తాయో తెలియని పరిస్థితి. అయితే కొన్ని సమయాల్లో ముందు సమాచారం చెప్పకుండానే రద్దు చేస్తుంటారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే బస్సు ఎక్కడుంది? ఏ సమయానికి వస్తుంది.? తెలిసిపోతుంది. దీనివల్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు–వెలుగు బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం పెరిగిందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల వారే ఈ యాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతి బస్సులో జీపీఎస్ ‘ట్రాకింగ్’ పరికరాన్ని అమర్చారు. దీంతో బస్సును ట్రాకింగ్ చేయడం సాధ్యపడుతోంది. గత ఏడాది అధికారులు ప్రయాణికులకు విస్తతంగా అవగాహన కల్పించారు. ప్రయాణికులు దీన్ని వినియోగించుకుంటే భద్రత, సుఖవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందనడంలో సందేహం లేదు. మహిళలకు భద్రత ఈ యాప్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది బస్సు ఏ సమయానికి ఉందో తెలియక రోడ్డుపై నిరీక్షిస్తుంటారు. ఆ సమయంలో మహిళలు, ఆకతాయిల వేధింపులు, చైన్ స్నాచర్స్ నుంచి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్ ద్వారా బస్సు వచ్చే సమయానికి అక్కడికి చేరుకోవచ్చు. ఒకవేళ బస్సులో ఇబ్బందులు ఎదురైతే ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లైవ్ ట్రాక్ ద్వారా పోలీసులు బస్సున్న చోటికి నిమిషాల్లో చేరుకుంటారు. -
నగరం ఊగింది
సాక్షి, సిటీబ్యూరో: ఒకరూ ఇద్దరూ కాదు పదుల సంఖ్యలో డీజేలు, భారీ వేదికలు, వేల వాట్ల సంగీతం.. వెరసి నగరవాసుల్ని కొత్త అనుభూతికి గురిచేశాయి. శనివారం రాత్రిని మెమరబుల్ నైట్‌గా మార్చాయి. ప్రపంచంలోనే భారీ మ్యూజికల్ షోగా ప్రసిద్ధి చెందిన ‘టుమారో ల్యాండ్ రిప్లికా’ ఈవెంట్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ఆహూతులను ఉర్రూతలూగించింది. మొత్తం 8 దేశాలతో ఏకకాలంలో అనుసంధానించిన ఈ ఈవెంట్‌కు సిటీజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లాస్ట్ స్టోరీస్, అనీష్ సూద్, కేరనీ బీ2బీ, జోషి, కాండైస్ రెడ్డింగ్ విల్... తదితర టాప్ డీజేల లైవ్ పెర్ఫార్మెన్స్ పూర్తయ్యాక.. బెల్జియంలోని బూమ్ సిటీ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమయ్యాయి. పైరో, సీఓ2 స్పెషల్ ఎఫెక్ట్స్‌ను డైరెక్ట్‌గా బెల్జియంలోని ప్రధాన వేదికకు అనుసంధానించడం ద్వారా నిక్కీ రొమెరో, ఆఫ్రోజాక్, డిడిట్రీ వెగాస్, లైక్ మైక్.. వంటి అంతర్జాతీయ ప్రసిద్ధ డీజేల లైవ్ ట్రాక్స్ నగరవాసులకు వీనులవిందు చేశాయి.