Published
Tue, May 2 2017 2:09 AM
| Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
కూడేరు (ఉరవకొండ): కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. నెలన్నర క్రితం 2.3 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. సోమవారం నాటికి డ్యాంలో 2 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ డీఈ పక్కీరప్ప విలేకరులకు తెలిపారు. డ్యాంలోకి ఇన్‌ఫ్లో ఏమాత్రమూ లేదన్నారు. డ్యాంలో ఏర్పాటు చేసిన అనంత, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 60 నుంచి 70 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ వేసవిలో తాగునీటి ప్రాజెక్టులకు నీటి విషయంలో ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. డ్యాంలో 1.5 టీఎంసీల నీరు ఉన్నా తాగునీటి ప్రాజెక్ట్‌లకు సరిపోతుందన్నారు. డ్యాంలో ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిì సరఫరా పూర్తిగా నిలిపివేశామని చెప్పారు.