
కముజు పిట్టలతో విందుకు యత్నం
హరితహారంలో వన్యప్రాణుల వధ
మర్పల్లి : హరితహారం కార్యక్రమంలో కొందరు వన్యప్రాణులను వధించారు. కముజు పిట్టలతో విందు జరుపుకొన్నారు. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలంలో జరిగింది. శుక్రవారం మర్పల్లి వ్యవసాయ మార్కెట్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం పది గంటలకు మార్కెట్ కార్యాలయం ఎదుట 11 కముజు పిట్టల కాళ్లు కట్టి నీటి తొట్టెలో ఉన్న మొక్కల ముందు ఉంచారు.
అనంతరం హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు వాటిని వండి వడ్డించేందుకు మాంసం దుకాణాలకు తరలించి వాటిని కోయించారు. వంటకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ విషయం బయటకు పొక్కడంతో అతిథులు భోజనం చేయకుండానే వెళ్లారు.