
మధిరను ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో ఉంచాలని మంత్రికి విజ్ఞప్తి చేస్తున్న చైర్‌పర్స¯ŒS నాగరాణి
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
గండుగులపల్లి (దమ్మపేట): ప్రజాభీష్టం, పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం విభజిస్తోందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మధిర, ఎర్రుపాలెం మండలాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఆదివారం గండుగులపల్లిలో మంత్రిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. మధిర, ఎర్రుపాలెం మండలాలను ఖమ్మం రెవెన్యూ డివిజ¯ŒSలో కలపాలని మధిర నగర పంచాయతీ చైర్‌పర్స¯ŒS మొండితోక నాగరాణి సుధాకర్ విజ్ఞప్తి చేశారు. మంత్రి మాట్లాడుతూ.. పాలనను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ జిల్లాలు విభజించాలని నిర్ణయించారని చెప్పారు. జిల్లా, రెవెన్యూ డివిజన్ల విభజనపై ప్రభుత్వానికి ఆ¯ŒSలై¯ŒSలో అనేక వినతులు, ఫిర్యాదులు అందాయన్నారు.
రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
జిల్లావ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆ శాఖ ఎస్‌ఈ లింగయ్య, ఈఈ రవీంద్ర కుమార్, డీఈఈ తానేశ్వర్‌ను మంత్రి తుమ్మల ఆదేశించారు. సత్తుపల్లి–పట్వారిగూడెం రోడ్డు పనులను ఎన్నాళ్లు చేస్తారని ప్రశ్నించారు. సత్తుపల్లి మండలం గంగారంలో విస్తరణ పనులను ఈ నెల 24న పర్యవేక్షిస్తానన్నారు. గంగారం నుంచి మందలపల్లి వరకు రాష్రీ్టయ రహదారి విస్తరణ ఎలా చేశారో.. తాళ్లమడ నుంచి సత్తుపల్లి వరకు కూడా అలాగే చేయాలని ఆదేశించారు. అశ్వారావుపేటలో రూ.17 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ విస్తరణ పనులు పూర్తిచేసిన తర్వాతనే సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరవుతాయని స్పష్టం చేశారు. అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ పనులను రైతులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో డీసీసీబీ చైర్మ¯ŒS మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ వైస్ చైర్మ¯ŒS బోయినపల్లి సుధాకర్, టీఆర్‌ఎస్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, మచ్చా శ్రీనివాసరావు, ఎస్‌ఏ రసూల్, చల్లగుâýæ్ల నరసింహారావు, కోటగిరి బుజ్జి, పసుమర్తి చంద్రరావు, చింతనిప్పు సత్యనారాయణ, చక్కిలాల లక్ష్మణరావు, కాసాని నాగప్రసాద్, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు, కురిశెట్టి సత్తిబాబు, పానుగంటి రాంబాబు తదితరులు ఉన్నారు.