
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని నెలలుగా అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ కాంగ్రెస్ పారీ్టలో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేశారని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అందుకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కేవలం భారీ సభలకే పరిమితమైతే చాలదు. ప్రజల్లోకి వెళ్లాలి. వారితో మమేకమై పని చేయాలి.
అప్పుడే వారి విశ్వాసాన్ని పొందగలం’’ అంటూ నేతలకు, శ్రేణులకు ఉద్బోధించారు. బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీలోని పలు విభాగాల చీఫ్‌లు, ముఖ్య నేతలతో ఆయన సమీక్ష జరిపారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై చర్చించారు. పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధఋ తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపై దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు భేటీలో పాల్గొన్నారు.
ఓట్లను సీట్లుగా మార్చాలి
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.92 కోట్ల ఓట్లొచ్చినా సీట్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని ఖర్గే గుర్తు చేశారు. అందుకే దేశం కోరుతున్న మార్పు సాకారం కావాలంటే కాంగ్రెస్ శ్రేణులన్నీ అట్టడుగు స్థాయిలో రాత్రింబవళ్లు కష్టపడాలని సూచించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర విజయానికి కృషి చేయాలన్నారు. బీజేపీ పదేళ్ల వైఫల్యాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. విపక్ష ఇండియా కూటమి బలోపేతం అవుతుండటంతో పాలక ఎన్డీఏలో కలవరపాటు మొదలైందన్నారు. ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారాన్ని ఎదుర్కోవాలన్నారు. దేశంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని చెడగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment