దేశ సంస్కృతిని దశదిశలా వ్యాపింపజేయాలి | The spread of the culture of the country dasadisala | Sakshi
Sakshi News home page

దేశ సంస్కృతిని దశదిశలా వ్యాపింపజేయాలి

Published Fri, Oct 7 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

దేశ సంస్కృతిని దశదిశలా వ్యాపింపజేయాలి

దేశ సంస్కృతిని దశదిశలా వ్యాపింపజేయాలి

తొగిట ఆశ్రమ పీఠాధిపతి పిలుపు
- రంగంపేటలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాథమిక శిక్షావర్గ ముగింపు

కొల్చారం: ప్రపంచంలోనే అత్యున్నత సంస్కృతి కలిగిన భారతీయ సంస్కృతిని దశదిశలా వ్యాపింపజేయాలని తొగిట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామీజి పిలుపునిచ్చారు. ఈనెల ఒకటి నుంచి రంగంపేటలో నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ప్రాథమిక శిక్షావర్గ శుక్రవారం ముగిసింది. చివరి రోజు శిక్షావర్గ సార్వజనికోత్సవాన్ని నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన మాధవానంద సరస్వతీ స్వామీజి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి మతాలకతీతంగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర టెస్కో డైరెక్టర్‌ అరిగె రమేష్‌ మాట్లాడుతూ... సమైక్యతే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ప్రాంత ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యవాహ ఎక్క చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కార్యవాహ బోల నాగభూషణం, కొల్చారం మండల శిక్షావర్గ కార్యవాహ వంజరి వెంకటేశం, ఆయా  గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement