on Friday
-
దేశ సంస్కృతిని దశదిశలా వ్యాపింపజేయాలి
తొగిట ఆశ్రమ పీఠాధిపతి పిలుపు - రంగంపేటలో ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షావర్గ ముగింపు కొల్చారం: ప్రపంచంలోనే అత్యున్నత సంస్కృతి కలిగిన భారతీయ సంస్కృతిని దశదిశలా వ్యాపింపజేయాలని తొగిట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామీజి పిలుపునిచ్చారు. ఈనెల ఒకటి నుంచి రంగంపేటలో నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాథమిక శిక్షావర్గ శుక్రవారం ముగిసింది. చివరి రోజు శిక్షావర్గ సార్వజనికోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాధవానంద సరస్వతీ స్వామీజి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి మతాలకతీతంగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర టెస్కో డైరెక్టర్ అరిగె రమేష్ మాట్లాడుతూ... సమైక్యతే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ప్రాంత ఆర్ఎస్ఎస్ కార్యవాహ ఎక్క చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ బోల నాగభూషణం, కొల్చారం మండల శిక్షావర్గ కార్యవాహ వంజరి వెంకటేశం, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. - -
బస్సుల కోసం రోడెక్కిన విద్యార్థులు
అంతారంగేట్‌వద్ద రాస్తారోకో ఎస్ఐ హామీతో విరమణ కౌడిపల్లి : బస్‌లకోసం విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. అంతారంగేట్‌వద్ద మెదక్ నర్సాపూర్ రహదారిపై శుక్రవారం వివిధ గ్రామాలు, తండాలకు చెందిన విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు పీన, ప్రవీణ, సంగీత, మధుసూదన్, అంజనేయులు తదితరులు మాట్లాడుతూ వివిధ గ్రామాలకు, తండాలకు చెందిన సుమారు వందమంది విద్యార్థులు ప్రతిరోజు నర్సాపూర్‌కు పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలకు వెల్తామని తెలిపారు. కాగా ఉదయం సమయానికి బస్‌లు లేకపోవడంతో ప్రతిరోజలు గంట ఆలస్యంగా వెలుతున్నామని తెలిపారు. దీంతో రోజు ఒక పీరియడ్ అయిపోతుందని చెప్పారు. ఉదయం 8 నుండి 9.30 గంటలవరకు విద్యార్థుల కోసం అదనంగా నర్సాపూర్ వరకు బస్‌లు నడపాలని పలుమార్లు అధికారులను కోరినప్పటికి స్పందించడం లేదన్నారు. గంటపాలు విద్యార్థులు రాస్తారోకో చేయడంతో పలు వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ డీఎం లేద ఆర్ఎం వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు రాస్తారోకోను విరమించేది లేదన్నారు. ఎస్ఐ శ్రీనివాస్ విద్యార్థులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. -
వానరానికి అంత్యక్రియలు
దుబ్బాక: నగర పంచాయతీ పరిధిలోని లచ్చపేట గ్రామంలో శుక్రవారం వానరానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన కోతి మరణించింది. దీన్ని గమనించిన గ్రామస్తులు వానరానికి శాస్త్రోక్తంగా అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కూరపాటి బంగారయ్య, గ్రామస్తులు బడుగు రాజు, చెలిముల రాజేశం, బోడ అరుణ్, కూరపాటి మురళి తదితరులు పాల్గొన్నారు.