బస్సుల కోసం రోడెక్కిన విద్యార్థులు
అంతారంగేట్‌వద్ద రాస్తారోకో
ఎస్‌ఐ హామీతో విరమణ
కౌడిపల్లి : బస్‌లకోసం విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. అంతారంగేట్‌వద్ద మెదక్ నర్సాపూర్ రహదారిపై శుక్రవారం వివిధ గ్రామాలు, తండాలకు చెందిన విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు పీన, ప్రవీణ, సంగీత, మధుసూదన్, అంజనేయులు తదితరులు మాట్లాడుతూ వివిధ గ్రామాలకు, తండాలకు చెందిన సుమారు వందమంది విద్యార్థులు ప్రతిరోజు నర్సాపూర్‌కు పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలకు వెల్తామని తెలిపారు.
కాగా ఉదయం సమయానికి బస్‌లు లేకపోవడంతో ప్రతిరోజలు గంట ఆలస్యంగా వెలుతున్నామని తెలిపారు. దీంతో రోజు ఒక పీరియడ్ అయిపోతుందని చెప్పారు. ఉదయం 8 నుండి 9.30 గంటలవరకు విద్యార్థుల కోసం అదనంగా నర్సాపూర్ వరకు బస్‌లు నడపాలని పలుమార్లు అధికారులను కోరినప్పటికి స్పందించడం లేదన్నారు.
గంటపాలు విద్యార్థులు రాస్తారోకో చేయడంతో పలు వాహనాలు నిలిచిపోయాయి. ఆర్‌టీసీ డీఎం లేద ఆర్‌ఎం వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు రాస్తారోకోను విరమించేది లేదన్నారు. ఎస్‌ఐ శ్రీనివాస్ విద్యార్థులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.