That s
-
రోడ్డెక్కిన ఖాతాదారులు
అనంతపురం- బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో కూడేరు: ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండానే కేంద్రం పెద్దనోట్లు రద్దు చేయడం వల్ల డబ్బు కోసం భిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని పలువురు వాపోయారు. గురువారం కూడేరులో స్టేట్ బ్యాంక్ వద్దకు సుమారు 300 మంది రాగా, బ్యాంక్ అధికారులు క్యాష్ లేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన వారు రోజూ ఇదే మాట చెబితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అనంతపురం – బళ్ళారి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. దాదాపు రెండు గంటలపాటు వారంతా రోడ్డుపైనే బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మేనేజర్ జయశీల్, పోలీసులు వచ్చి వారికి సర్ది చెప్పారు. ప్రస్తుతం టోకన్లు ఇస్తామని, డబ్బు రాగానే నగదు పంపిణీ చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
నష్టపరిహారం చెల్లించాలని రైతుల రాస్తారోకో
నర్సంపేట : నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాని కోరుతూ రైతులు పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాలకు చెందిన రైతులు లక్కి మిర్చి విత్తనాలు ప్యాకెట్‌కు రూ.450 చొప్పున కొనుగోలు చేశారు. ఎకరానికి 12 నుంచి 15 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు వేశారు. మొక్క ఎదిగే సమయంలో కాండానికి పూత వచ్చినా కాయలు లేవని, వారం క్రితం రాస్తారోకో చేయగా కంపెనీ ప్రతినిధులు వచ్చి శాస్త్రవేత్తలను తీసుకొచ్చి సర్వే చేయిస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఎవరూ రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో రెండుగంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎస్సైలు హరికృష్ణ, రాజువర్మ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెపినా వారు వినకపోవడంతో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాస్తారోకో విరమించి నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు కంపెనీ ప్రతినిధులతో ఫొ¯ŒSలో మాట్లాడడంతో శాస్త్రవేత్తలతో సర్వే నిర్వహించి 80 శాతం పరిహారం చెల్లిస్తామని చెప్పారు. రైతులు అందుకు ఒప్పుకోకపోవడంతో రైతులు కొనుగోలు చేసిన ప్యాకెట్ రూ. 700 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. దానికి కూడా రైతులు అంగీకరించలేదు. రాస్తారోకోకు సీపీఐ ఎంఎల్ నాయకుడు మోడెం మల్లేషం, న్యూడెమెక్రసీ నాయకుడు తోటకూరి రాజు, సీపీఐ డివిజ¯ŒS కార్యదర్శి భూక్య సమ్మయ్య, నాయకులు కందికట్ల వీరేష్ మద్దతు తెలిపారు. -
బస్సుల కోసం రోడెక్కిన విద్యార్థులు
అంతారంగేట్‌వద్ద రాస్తారోకో ఎస్ఐ హామీతో విరమణ కౌడిపల్లి : బస్‌లకోసం విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. అంతారంగేట్‌వద్ద మెదక్ నర్సాపూర్ రహదారిపై శుక్రవారం వివిధ గ్రామాలు, తండాలకు చెందిన విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు పీన, ప్రవీణ, సంగీత, మధుసూదన్, అంజనేయులు తదితరులు మాట్లాడుతూ వివిధ గ్రామాలకు, తండాలకు చెందిన సుమారు వందమంది విద్యార్థులు ప్రతిరోజు నర్సాపూర్‌కు పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలకు వెల్తామని తెలిపారు. కాగా ఉదయం సమయానికి బస్‌లు లేకపోవడంతో ప్రతిరోజలు గంట ఆలస్యంగా వెలుతున్నామని తెలిపారు. దీంతో రోజు ఒక పీరియడ్ అయిపోతుందని చెప్పారు. ఉదయం 8 నుండి 9.30 గంటలవరకు విద్యార్థుల కోసం అదనంగా నర్సాపూర్ వరకు బస్‌లు నడపాలని పలుమార్లు అధికారులను కోరినప్పటికి స్పందించడం లేదన్నారు. గంటపాలు విద్యార్థులు రాస్తారోకో చేయడంతో పలు వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ డీఎం లేద ఆర్ఎం వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు రాస్తారోకోను విరమించేది లేదన్నారు. ఎస్ఐ శ్రీనివాస్ విద్యార్థులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.