నష్టపరిహారం చెల్లించాలని రైతుల రాస్తారోకో
Published Tue, Sep 27 2016 1:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
నర్సంపేట : నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాని కోరుతూ రైతులు పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాలకు చెందిన రైతులు లక్కి మిర్చి విత్తనాలు ప్యాకెట్‌కు రూ.450 చొప్పున కొనుగోలు చేశారు. ఎకరానికి 12 నుంచి 15 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు వేశారు.
మొక్క ఎదిగే సమయంలో కాండానికి పూత వచ్చినా కాయలు లేవని, వారం క్రితం రాస్తారోకో చేయగా కంపెనీ ప్రతినిధులు వచ్చి శాస్త్రవేత్తలను తీసుకొచ్చి సర్వే చేయిస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఎవరూ రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో రెండుగంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎస్సైలు హరికృష్ణ, రాజువర్మ అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెపినా వారు వినకపోవడంతో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాస్తారోకో విరమించి నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు కంపెనీ ప్రతినిధులతో ఫొ¯ŒSలో మాట్లాడడంతో శాస్త్రవేత్తలతో సర్వే నిర్వహించి 80 శాతం పరిహారం చెల్లిస్తామని చెప్పారు. రైతులు అందుకు ఒప్పుకోకపోవడంతో రైతులు కొనుగోలు చేసిన ప్యాకెట్ రూ. 700 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. దానికి కూడా రైతులు అంగీకరించలేదు. రాస్తారోకోకు సీపీఐ ఎంఎల్ నాయకుడు మోడెం మల్లేషం, న్యూడెమెక్రసీ నాయకుడు తోటకూరి రాజు, సీపీఐ డివిజ¯ŒS కార్యదర్శి భూక్య సమ్మయ్య, నాయకులు కందికట్ల వీరేష్ మద్దతు తెలిపారు.
Advertisement
Advertisement