
మనోజ్ కుమార్ (ఫైల్)
పూతలపట్టు (యాదమరి): రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంపేటకు చెందిన పురుషోత్తం కుమారుడు మనోజ్ కుమార్ (24) జమ్మూకశ్మీర్‌లో జవాన్‌గా పనిచేస్తున్నారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.
ఈ నెల 15 తర్వాత విధుల్లో చేరాల్సి ఉంది. కాగా, శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై సొంత పని మీద పూతలపట్టుకు వెళ్లి తిరిగి ఇంటికొస్తుండగా తిరుపతి నుంచి చిత్తూరు వైపు వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మనోజ్ అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెళ్లయిన మూడు నెలలకే ప్రమాదంలో మృతి చెందడంతో జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment