Published
Sun, Aug 21 2016 11:13 PM
| Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
బాధ్యతల బరువు
చింతపల్లి: మన్యం మహిళల జీవనశైలి భిన్నంగా ఉంటుంది. తెల్ల వారు లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఆమె ప్రతి పనిలో భాగస్వామిగా ఉంటూ జీవన పోరాటంలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. గిరిజన మహిళలు ఏ రంగంలో ఉన్నా తమ బాధ్యతలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా, రాజకీయ పదవుల్లో ఉన్నా ఇంటి కుటుంబ బాధ్యతలు మరిచి పోక పోవడమే వారి ప్రత్యేకత. అందుకే మన్యం మహిళలు శ్రమ జీవులుగా మన్ననలు అందుకుంటున్నారు.