మృతిచెందిన వెంకట్‌రెడ్డి(ఫైల్), విషమ పరిస్థితిలో రమణ
మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన మహిళ దేశబోయిన రమణ(35), తమ్మిశెట్టి వెంకట్‌రెడ్డి(20) మంగళవారం ఊరి చివరన ఉన్న జామాయిల్ తోటలో స్ప్రైట్ కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా..వెంకట్‌రెడ్డి మృతి చెందాడు.
-
అతడు మృతి, ఆమె పరిస్థితి విషమం
మణుగూరు రూరల్: మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన మహిళ దేశబోయిన రమణ(35), తమ్మిశెట్టి వెంకట్‌రెడ్డి(20) మంగళవారం ఊరి చివరన ఉన్న జామాయిల్ తోటలో స్ప్రైట్ కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా..వెంకట్‌రెడ్డి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రమణకు గతంలోనే వివాహమై, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం భర్త మరణించాడు. పిల్లలతో కలిసి రామానుజవరంలో ఉంటోంది. ఈ క్రమంలో రమణ, వెంకట్‌రెడ్డిల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అవివాహితుడైన ఇతను ఇటీవల ఆటో కొన్నాడు. ఇద్దరు కలిసి ఆ వాహనంలో భద్రాచలం వెళ్లి వస్తూ..వెంట తెచ్చుకున్న పురుగులమందును స్ప్రైట్ కూల్‌డ్రింక్‌లో కలుపుకొని తాగి గిలగిలా కొట్టుకుంటున్న క్రమంలో మేకల కాపరులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు స్థానికుల సాయంతో..ఇరువురిని మణుగూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే వెంకట్‌రెడ్డి మృతి చెందినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న రమణను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై షణ్ముక చారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.