మాటలు.. మంటలు | The words of the fires .. | Sakshi
Sakshi News home page

మాటలు.. మంటలు

Published Mon, Mar 6 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

మాటలు.. మంటలు

మాటలు.. మంటలు

= పిచ్చి కుక్కలా మాట్లాడొద్దు
= రౌడీయిజం చేస్తే నాలుక్కోస్తాం
= త్వరలోనే తాడిపత్రి ప్రజలు చీపుర్లతో కొడతారు
= మంత్రి పదవి కావాలంటే బాబు ఇంట్లో ఊడిగం చేస్కో
= జేసీపీఆర్‌కు వైఎస్సార్‌సీపీ నేతల హెచ్చరిక
= అనంతలో దివాకర్‌ రోడ్‌లైన్స్ ముట్టడి 
= జిల్లావ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం 
 
అనంతపురం టౌన్ : ‘ఖబడ్దార్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డీ..   పిచి్చకుక్కలా మాట్లాడుతున్నావ్‌ నోరు అదుపులో పెట్టుకో. .. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోతే ఎవరూ మాట్లాడకూడదా? వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు వాగుతావా? రౌడీయిజం చేస్తే నాలుకకోస్తాం’ అని వైఎస్సార్‌సీపీ నేతలు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని హెచ్చరించారు. వైఎస్‌ జగన్, వైఎస్‌ కుటుంబంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఎక్కడికక్కడ జేసీ పీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ‘మీ నాన్న స్వాతంత్య్ర సమరయోధుడుంటున్నావ్‌.. ఇదేనా మీ పెద్దలు నేర్పిన సంస్కారం. డబ్బు మదమెక్కి ఇష్టం ఇచ్చినట్లు మాట్లాడతావా? నువ్వెంత.. నీ బతుకెంత? 13 ఏళ్ల క్రితం తాడిపత్రి నుంచి పారిపోయిన నువ్వా మా అధినేత గురించి వ్యాఖ్యానించేది. ఇంకోసారి ఇలాగే మాట్లాడితే జిల్లా నుంచి తరిమి తరిమి కొడతాం. త్వరలోనే తాడిపత్రి ప్రజలు నిన్ను చీపుర్లతో కొడతారు’ అంటూ నేతలు హెచ్చరించారు. ‘మంత్రి పదవి కోసమే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నావా? మంత్రి పదవే కావాలనుకుంటే చంద్రబాబు ఇంట్లో ఊడిగం చేస్కో’ అని సూచించారు. వాస్తవాలను రాస్తున్న ‘సాక్షి’ పత్రిక కార్యాలయం ఎదుట ధర్నా చేసి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేయడం సిగ్గుచేటుగా లేదా? అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, తక్షణం వైఎస్‌ జగన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 
దివాకర్‌ రోడ్‌లైన్స్ కార్యాలయం ముట్టడి 
అనంతపురంలోని సుభాష్‌రోడ్డులో ఉన్న దివాకర్‌ రోడ్‌లైన్స్ కార్యాలయాన్ని వైఎస్సార్‌ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ముట్టడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీం అహ్మద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుపై మండిపడ్డారు. 
దిష్టిబొమ్మల దహనం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు జేసీ ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కదిరిలో దిష్టిబొమ్మను దహనం చేసిన నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో సమన్వయకర్త డాక్టర్‌ సిద్దారెడ్డి స్టేషన్ కు చేరుకుని ధర్నాకు దిగారు. దీంతో వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. గుంతకల్లులోని పొట్టిశ్రీరాములు సర్కిల్‌లో నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రావిురెడ్డి, డి.హీరేహాళ్‌లో రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. నల్లమాడ, ఓడీ చెరువు, అమడగూరు, బ్రహ్మసముద్రం,  బత్తలపల్లి, హిందూపురం, పెనుకొండ, గుత్తి, బుక్కపట్నం, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, కుందుర్పి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. ధర్నాలు నిర్వహించి జేసీ ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. తక్షణం వైఎస్‌ జగన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గుండాగిరీ చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement