యువకుడి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం | The young man stepped up to investigate the murder case | Sakshi
Sakshi News home page

యువకుడి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

Published Mon, Aug 22 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

యువకుడి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

యువకుడి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

మట్టెవాడ(గూడూరు) : మండలంలోని మట్టెవాడ శివారులో ఉన్న కొంగరగిద్దలో శని వారం రాత్రి యువకుడు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన సంఘటన పలు సందేహాలకు తావిస్తోంది. కొంగరగిద్ద గ్రామ సమీపంలోని మెు క్కజొన్న చేనులో విద్యుత్‌ మోటార్‌ మెకానిక్‌ ఇరుప ఈశ్వర్‌(30) రక్తపు మడుగులో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం ఉదయం సీఐ బి.రమేష్‌నాయక్, ఎస్సై సతీష్‌లు డాగ్‌ స్క్వాడ్‌తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 
మృతదేహాన్ని పరిశీ లించిన అనంతరం గ్రామస్తులతో మా ట్లాడి పలు వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం కారణమై ఉం డొచ్చని పలువురు పేర్కొనగా, విద్యు త్‌ మోటార్ల రిపేర్‌ వ్యాపారానికి గండి కొడుతున్నాడని ఎవరైనా తోటి మెకానిక్‌లు హతమార్చి ఉండొచ్చని ఇం కొందరు గ్రామస్తులు పోలీసులకు చె ప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మృ తుడి భార్య పద్మ తన భర్త ఈశ్వర్‌ హత్యకు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారకులై ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. అనంతరం ఈశ్వర్‌ భౌతికకాయానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టంకు తరలించారు. వెంటనే పోలీ సులు అనుమానితులుగా భావించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు, మరికొందరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement