అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య | The young man committed suicide by paying off debt | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

Published Sun, Aug 20 2017 11:21 PM | Last Updated on Tue, Sep 12 2017 12:36 AM

The young man committed suicide by paying off debt

పరిగి: గొల్లపల్లికి చెందిన చిన్న మల్లయ్యగారి మల్లికార్జున అలియాస్‌ సీఎం మల్లి (25) అప్పులు ఎక్కువై బయట తలెత్తుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ శరత్‌చంద్ర, బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లిలో మగ్గాలు నేస్తూ భార్య, కుమార్తెను పోషించేవాడు. గ్రామంలో చిట్టీలు వేసి.. పలువురికి పూచీ కూడా పడ్డాడు. ఈ క్రమంలో దాదాపు రూ.లక్ష వరకు అప్పయ్యింది. మద్యం, ఇతర వ్యసనాలకు అలవాటుపడటంతో మరో లక్ష రూపాయల వరకు చేతి బదుల రూపంలో పలువురి వద్ద అప్పు చేశాడు. వచ్చిన సంపాదనతో అప్పులు తీరకపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం అర్ధరాత్రి ఇంటి సమీపంలోని చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం వేకువజామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఎస్‌ఐ శరత్‌చంద్ర తన పోలీసు బృందంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement