మూడిళ్లల్లో చోరీలు
Published Tue, Aug 9 2016 12:51 AM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM
రూ.60 వేలు నగదు, 12 సవర్ల బంగారు అపహరణ
కోవూరు: ఇళ్లల్లో ఎవరూ లేరని పసిగట్టిన దుండగులు ఆదివారం అర్ధరాత్రి మూడిళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. రూ.60 వేలు నగ దు, 12 సవర్ల బంగారు అపహరించారు. చిన్నపడుగుపాడు ప్రాంతానికి చెందిన లఘతోటి నరసమ్మ ఇంటికి తాళం వేసి మిద్దెపై నిద్రపోతున్న సమయంలో దుం డగులు ఇంటి తలుపులు పగుల కొట్టి బీరువాలో ఉన్న రూ.40 వేలు నగదుతో పాటు 5 సవర్ల బంగారు ఆభరణాలు అపహరిం చారు. సమీపంలోనే ఉన్న అంబటి రాజేష్ కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ వివాహానికి వెళ్లగా దుండగలు ఆ ఇంటి తలుపులు పగులకొట్టి రెండు సవర్ల బంగారు వస్తువులు అపహరించారు. ఎన్టీఎస్ గేటు ఎదురుగా ఉన్న బడికాల శ్రీనివాసులు అల్లూరులోని వివాహానికి వెళ్లగా ఆ ఇంట్లో కూడా దుండగలు ప్రవేశించి రూ.10,500 నగదుతో పాటు 5 సవర్ల బంగారు వస్తువులను తీసుకువెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. ఎస్‌ఐ అళహరి వెంకట్రావు సంఘటన స్థలాలను పరిశీలించారు. క్లూస్‌టీం ఏఎస్‌ఐ శరత్‌బాబు చోరీ జరిగిన ఇళ్లల్లో దుండగలు వేలిముద్రలు సేకరించారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement