థింకింగ్, మేకింగ్‌ ఢిఫరెంట్‌ ‘కాలాయా తస్మై నమః’ | thinking and making different kalaya tasmai namahaa | Sakshi
Sakshi News home page

థింకింగ్, మేకింగ్‌ ఢిఫరెంట్‌ ‘కాలాయా తస్మై నమః’

Published Fri, Sep 2 2016 10:09 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

థింకింగ్, మేకింగ్‌ ఢిఫరెంట్‌ ‘కాలాయా తస్మై నమః’ - Sakshi

థింకింగ్, మేకింగ్‌ ఢిఫరెంట్‌ ‘కాలాయా తస్మై నమః’

  • కాలాన్ని నమ్మిన కళాకారులు
  • ఒక్క ఛాన్స్‌ కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షణ
  • సినిమాయే లోకంగా అన్వేషణ
  • తొలి ప్రయత్నమే విభిన్నం
  • ‘సాక్షి’తో చిత్ర యూనిట్‌ 
  • సాక్షి,విశాఖపట్నం : సినిమా తీయాలనే కల వారిది..ఒక్క ఛాన్స్‌ వస్తే చాలు  తామేంటో నిరూపించుకోవాలనే ఆశ వారిది. కానీ అందరిలా వారు ఆలోచించలేదు. తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. వెండితెరపైకి వస్తున్నామంటే తమవైపు ప్రపంచం చూడాలనుకున్నారు. ‘కాలమే దైవం’ అని నమ్మి ‘కాలాయా తస్మై నమః’ మొదలుపెట్టారు. టైటిల్‌లోనే వెరైటీ కనిపిస్తోంది. కానీ పేరు చూసి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల మాత్రమే సరిపోరు. ఇంకా ఏదో కావాలి. జనాన్ని ఆకర్షించాలి. దానికోసం తమ చిత్రంలో ఏదోఒక ప్రత్యేకత చూపించాలనుకున్నారు. ఎప్పుడో 1987 సెప్టెంబర్‌ 10న పుష్పక విమానం వచ్చింది. కమల్‌హాసన్‌ నటనకు జనం బ్రహ్మర«థం పట్టారు. ఆ తర్వాత తెలుగులో మూకీ చిత్రాలు రాలేదు. కాలాయా తస్మై నమః చిత్రాన్ని మూకీలో తీస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించారు.  చిత్ర క«థ ఎమోషన్స్‌పై ఆధారపడి ఉంటుంది. సినిమా మొత్తం హావభావాలతోనే ముడిపడిఉంటుంది. అలాంటప్పుడు మాటలతో పనేముందనుకున్నారు. ఇంకా సంతప్తి కలగడం లేదు. సాంకేతికంగా కూడా జనం మాట్లాడుకుకోవాలంటే గ్రాఫిక్స్‌ ఉండాలి. కానీ ఈ చిత్రం 1980లో ఓ పల్లెటూరి జరిగే కథ కావడంతో సహజంగానే ఉండాలనుకున్నారు. మరెంచేయాలని తీవ్రంగా మదనపడుతున్న తరుణంలో స్లోమోషన్‌ టెక్నిక్‌లో తీస్తే కొత్తగా ఉంటుందనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. సాధారణంగా ఏ చిత్రానైనా 24 ఫ్రేమ్స్‌లో తీస్తారు. కానీ ఈ సినిమా స్లోమోషన్‌లో 40 ఫ్రేమ్స్‌లో చిత్రీకరణ జరుపుకుంది. ఇంకేం విభిన్న టైటిల్, తొలి భారత్‌లో పుష్పక విమానం తర్వాత తొలి మూకీ, ప్రపంచంలో తొలి స్లో మోషన్‌ చిత్రంగా కాలాయా తస్మై నమః సిద్ధమైంది. ఇన్ని విశేషాలున్న చిత్రంలో నటించాలంటే అత్యంత అనుభవజ్ఞులైన నటీనటులు కావాలి. కానీ దీనిలో అందరూ కొత్త వాళ్లే నటించడం మరో విశేషం. మూకీ చిత్రానికి మ్యూజిక్‌ అందించడమంటే కత్తిమీద సామే. దానిని అత్యంత ప్రభావవంతంగా చేసి చూపించాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాంనారాయణ్‌. నిజానికి ఈ చిత్రానికి ఆయన అందించిన సంగీతమే ప్రాణం. కో డైరెక్టర్లుగా ఉదయ్‌ శంకర్‌ దార్ల,భరత్‌ జె, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా శ్రీకాంత్, అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఫ్రీడం వాసు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్‌గా అజ్గర్‌ అలీ పనిచేసిన ఈ చిత్రం ఫస్ట్‌ కాపీ చూసిన తర్వాత వాసు, సాయిరమేష్‌గౌడ్‌లు నిర్మాతలుగా మారారు.  థియేటర్ల కోసం చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ చిత్రం కూడా రుచి చూసింది. అయితేనేం చివరికి పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ నెల 2న ప్రేక్షుకుల ముందుకు వచ్చింది.
    ‘సాక్షి’ కోసమే తొలిసారి:
    దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నేతత్వంలో ‘సాక్షి’ నిర్వహించిన పూరీ ఐడియాస్‌ టెన్‌ కాంటెస్ట్‌ కోసం తొలిసారి షార్ట్‌షిల్మ్‌ నటుడిగా మారాను. మూడేళ్లు విప్రోలో ఉద్యోగం చేసినా సినిమా పిచ్చితో దానిని వదిలేశాను. రాకేష్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన షార్ట్‌ఫిల్మ్‌ డర్టీ పిక్చర్‌తో నటుడిగా ఆవిష్కతమయ్యాను. కాలాయా తస్మై నమః వంటి విభిన్న చిత్రంతో వెండి తెరకు పరిచయం కావడం అదష్టం. ఈ చిత్రంలో ‘ఈసు’ అనే రికార్డింగ్‌ డాన్సర్‌గా నటించాను. ఈ చిత్రంలో ప్రతి క్యారెక్టర్‌ ఓ హీరో.
    –నరేష్‌ నాయుడు, హీరో
    రొటీన్‌కు భిన్నంగా ఉండాలని:
    ఏడేళ్లు రక్షణ రంగంలో సేవలందించి వచ్చిన తర్వాత సినిమాయే జీవితంగా మారింది. చిన్నప్పుడు మా అమ్మ సినిమాలు బాగా చూసేది. బహుశా ఆ ప్రభావం నాపై పడినుట్టుంది. లవ్‌ఇన్‌వైజాగ్, డర్టీ పిక్చర్‌ వంటి షార్ట్‌ షిల్మ్స్‌ తర్వాత వెండి తెరపై దర్శకుడిగా నా పేరు ఒక్కసారైనా చూసుకోవాలనే కలను నిజం చేసుకోవడానికి కాలాయా తస్మై నమః మొదలుపెట్టాను. పవన్‌ కల్యాణ్‌ అంటే ఇష్టంతో ఆయన పుట్టినరోజు కానుకగా చిత్రాన్ని విడుదల చేశాం. రామ్‌గోపాల్‌వర్మ ప్రభావం నాపై ఎక్కువ. ఈ చిత్రంలో యాక్షన్‌ సీక్వెల్స్‌ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. జేమ్స్‌ కామెరూన్‌ తన చిత్రాల్లో ఎమోషన్స్‌కి ప్రాధాన్యమిస్తారు. అదే ఈ చిత్రంలోనూ ఉంటుంది. ఇళయరాజా సంగీతంపై ఉన్న పిచ్చితో ఈ చిత్రంలో ఓ సీన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన స్వరపరిచిన గీతం వినిపించాం. ఈ చిత్రం తర్వాత ‘రంగీలా’ అనే మరో విభిన్న చిత్రానికి, ‘జంతువు’ టైటిల్‌తో మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నాను.            –రాకేష్‌రెడ్డి, దర్శకుడు
    హావభావాలతోనే వేల పదాలు
    ఎందుకో తెలియదు..సినిమా అంటే పిచ్చి..హీరోయిన్‌గా నన్ను నేను నిరూపించుకోవడం కోసం రెండేళ్లుగా కష్టపడుతున్నా. షార్ట్‌ ఫిల్మ్స్‌ లవ్‌ఇన్‌ వైజాగ్, డర్టీ పిక్చర్‌లలో గుర్తింపు వచ్చింది. డర్డీ పిక్చర్‌లో నా పాత్ర పెను దుమారాన్నే లేపింది. అయితే మన దగ్గర నార్త్‌ హీరోయిన్లకు ఉన్న డిమాండ్‌ తెలుగు వాళ్లకు లేదు. అందుకే మా కంటూ ప్రత్యేకత చూపించాలి. తొలి చిత్రంతోనే అలాంటి అవకాశం రావడం అదష్టం. ఈ చిత్రంలో మల్లి అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశాను. కేవలం హావభావాలతోనే నా చేత వేల పదాలను డైరెక్టర్‌ రాకేష్‌రెడ్డి పలికించారు.
    –రేఖా భోజ్, హీరోయిన్‌
    చాలా కష్టపడ్డాం
    బాల నటుడిగా చేసే అవకాశం వచ్చినపుడు సినీ ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియకపోవడంతో పెద్దవాళ్లు వద్దన్నారు. కానీ అప్పుడే నా దష్టి సినిమాలపై పడింది. ఇంజినీరింగ్‌ చదివినప్పటికీ నటనవైపే మొగ్గుచూపాను. 13 షార్ట్‌షిల్మ్స్‌లో నటించాను. డర్టీపిక్చర్‌లో నటనను చూసిన ఆ షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ రెడ్డి, తన తొలి చిత్రంలో విలన్‌గా నాకు అవకాశం ఇచ్చారు. అవుట్‌పుట్‌లో కాంప్రమైజ్‌ కాకూడదని బెటర్‌మెంట్‌ కోసం చాలా కష్టపడ్డాం. మొదట్లో షూటింగ్‌ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను. కానీ కొన్ని రోజుల షూటింగ్‌ తర్వాత ఈ చిత్రంలో నటించకపోతే అనవసరం అనుకున్నాను. 
                                                                                                                                   –సంజు, విలన్‌
     
    కథలో నేనే కీలకం:
    రెండేళ్ల క్రితం ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీశాను. ఆ తర్వాత డైరెక్టర్‌ రాకేష్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. నాపై నమ్మకంతో ఈ చిత్రంలో కీలక పాత్ర నాతో చేయించారు.  కథకు అత్యంత కీలకమైన ఆ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకుని చేశాను. ఈ సినిమాలో ప్రతి సీన్‌ కొత్తగా ఉంటుంది.                                                                        –శ్రీధా భట్, నటుడు
    షార్ట్‌ఫిల్మ్స్‌తో గుర్తింపు:
    రంగ స్థలం నుంచి మొదలుపెట్టి ఇరవై ఏళ్లుగా నటనారంగంలో ఉన్నాను. కానీ గతేడాదే నాకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది. ‘షార్ట్‌ఫిల్మ్స్‌ రావు రమేష్‌’ అని అందరూ అనేలా గుర్తింపు తెచ్చుకున్నాను. ఈ చిత్రంలో  నీతిగా బతికే ఊరి పెద్దగా నటించాను. తప్పు చేసిన వాడు కొడుకైనా సరే న్యాయం మాట్లాడే మనస్తత్వం ఉన్న పాత్ర అది.
    –సరిపల్లి సతీష్, నటుడు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement