‘నా కుమారుడి చావుకు కారకులైన వారిని శిక్షించాలి’
అనంతపురం సప్తగిరి సర్కిల్: తన కుమారుడు రంగారెడ్డి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షంచాలని కదిరికి చెందిన ప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు రంగారెడ్డి, కదిరికి చెందిన యువతి ప్రేమించుకున్నారని తెలిపారు.
ఆమె సూచన మేరకు తన కుమారుడు చెన్నై వెళ్లాడన్నారు. అయితే అక్టోబర్ 8న చెన్నైలో వాస్మోల్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తమకు తెలిసిందని వివరించారు. ఈ ఉదంతంలో కదిరి సీఐ వాహన డ్రైవర్ శరత్‌రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. దీంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.