కె.గంగవరం: తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కె.గంగవరం మండలం కూళ్ల గ్రామం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు గల్లంతయ్యారు.
కపిలేశ్వరం మండలం కోరుమిల్లి గ్రామానికి చెందిన ఏడుగురు ఆదివారం సాయంత్రం నదిలోకి స్నానానికి దిగారు. వారిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు గల్లంతు అయ్యారు. గాలింపు చర్యల్లో పురుషుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
గోదావరి జిల్లాలో విషాదం
Published Sun, Jan 17 2016 6:15 PM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM
Advertisement
Advertisement