three people missing
-
సముద్రతీరంలో ముగ్గురు గల్లంతు
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని వేటపాలెం మండలం కటారిపాలెం సముద్రతీరంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఉషా(19), భరత్‌రెడ్డి(20)గా పోలీసులు గుర్తించారు. గల్లంతైన మహేష్ అనే యువకుడి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. -
గోదావరి జిల్లాలో విషాదం
కె.గంగవరం: తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కె.గంగవరం మండలం కూళ్ల గ్రామం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు గల్లంతయ్యారు. కపిలేశ్వరం మండలం కోరుమిల్లి గ్రామానికి చెందిన ఏడుగురు ఆదివారం సాయంత్రం నదిలోకి స్నానానికి దిగారు. వారిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు గల్లంతు అయ్యారు. గాలింపు చర్యల్లో పురుషుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.