
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని వేటపాలెం మండలం కటారిపాలెం సముద్రతీరంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఉషా(19), భరత్‌రెడ్డి(20)గా పోలీసులు గుర్తించారు. గల్లంతైన మహేష్ అనే యువకుడి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment