ఏపీపై పిడుగుపాటు | thunderstorms causes 10 deaths in ap | Sakshi
Sakshi News home page

ఏపీపై పిడుగుపాటు

Published Sun, Sep 6 2015 6:32 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

ఏపీపై పిడుగుపాటు

ఏపీపై పిడుగుపాటు

- రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు
- ఆదివారం ఒక్కరోజే 10 మంది దుర్మరణం


రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఒకవైపు రైతులకు ఆనందాన్నిస్తుండగా, మరో వైపు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. ఆదివారం భారీ వర్షంతోపాటు పలు చోట్ల పిడుగులుపడి 10 మంది మృతి దుర్మరణం చెందారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఐదుగురు పిడుగుపాటుకు బలయ్యారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి మత్స్యకారులుగా జీవిస్తున్న తండ్రికొడుకులు.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గుడుపర్తిలో పిడుగుపాటుకుగురై మృత్యువాతపడ్డారు. చిల్లకూరు మండలం కోరువారిపాలెం వాసి ఉప్పుర వెదరయ్య, వరికుంటపాడు మండలం తొడుగుపాడుకు చెందిన నాగేశ్వరరావులు మరణించారు.

ఇటు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఆదివారం సాయంత్రం వేర్వేరు చోట్ల పిడుగుపడి ముగ్గురు మృతిచెందారు. వేములకోట గ్రామంలో బోరు వేస్తుండగా పిడిగుపడి బీహార్‌కు చెందిన సతీష్(24) అక్కడికక్కడే మృతిచెందాడు. తుర్లపాడు మండలం గానుగపెంట గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడులో పిడుగుపాటుకు వ్యక్తి మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయి.  తుళ్లూరు మండలం వడ్లమానులో పిడుగుపడి పొలంలో పనిచేస్తున్న శివరాంబాబు అనే వ్యక్తి మృతి చేందాడు.  కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కోనపురాజుపరవలో గిరి, గుంజాల జంగులు అనే మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇవేకాకుండా వరదల ధాటికి గోడకూలడంతో నెల్లూరు నగరంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఇటు తెలంగాణలోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్ లో భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement