టీఎంయూకే గుర్తింపు | Tmu win in RTC recginse elections | Sakshi
Sakshi News home page

టీఎంయూకే గుర్తింపు

Published Tue, Jul 19 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

టీఎంయూకే గుర్తింపు

టీఎంయూకే గుర్తింపు

  • ఆర్టీసీ ఎన్నికల్లో 12 స్థానాల్లో ఘన విజయం 
  • వేములవాడలో ఉనికి చాటుకున్న ఈయూ 
  • దూసుకుపోయిన బాణం... వెనుకబడిన బస్సు
  • కరీంనగర్‌ : ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఘన విజయం సాధించింది. కరీంనగర్‌ రీజియన్‌లోని మొత్తం 13 స్థానాలకు 12 స్థానాల్లో గెలుపొంది ముందజలో నిలిచింది. ఒక్క వేములవాడ డిపోలో మాత్రం టీఎంయూపై ఎంప్లాÄæూస్‌ యూనియన్‌ (ఈయూ) నెగ్గింది. ఎన్‌ఎంయూ, బహుజన కార్మిక యూనియన్లు అంతంత మాత్రంగానే ఓట్లు పొంది చివరి స్థానాల్లో నిలిచాయి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 5 నుంచి సాయంత్రం 6గంటలకు పోలింగ్‌ జరిగింది. రీజియన్‌లో 4822 మంది కార్మికులు, ఉద్యోగులకు ఓటుహక్కు ఉండగా 4702 ఓట్లు పోలయ్యాయి. రాత్రి 7గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. 9గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఆయా డిపోలు, వర్క్‌షాపుల్లో ఘన విజయం సాధించడంతో టీఎంయూ నాయకులు, కార్మికులు విజయోత్సవం జరుపుకున్నారు. రంగులు చల్లుకుని, టపాసులు పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. 
     
    –––––––––––––––––––––––––––
    స్థానం పోలైన ఓట్లు టీఎంయూ ఈయూ
    స్థానికం రాష్ట్రం స్థానికం రాష్ట్రం
    –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
    ఆర్‌ఎం కార్యాలయం 79 47 41 25 29
    జోనల్‌ వర్క్‌షాప్‌ 265 155 151 100 105
    హుస్నాబాద్‌ డిపో 274 193 195 78 75
    గోదావరిఖని డిపో 617 405 406 107 97
    మంథని డిపో 297 211 207 71 74
    కోరుట్ల డిపో 308 266 265 41 39
    మెట్‌పల్లి డిపో 277 145 149 132 127
    హుజారాబాద్‌ డిపో 365 205 204 148 142
    కరీంనగర్‌ 1డిపో 526 323 316 175 173
    కరీంనగర్‌ 2డిపో 571 297 316 235 228 
    జగిత్యాల డిపో 510 326 305 105 93
    సిరిసిల్ల డిపో 342 180 177 86 80
    వేములవాడ డిపో 284 82 78 105 105
    ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement