నాటిన మొక్కలను సంరక్షించాలి
నాటిన మొక్కలను సంరక్షించాలి
Published Tue, Sep 20 2016 10:40 PM | Last Updated on Wed, Sep 26 2018 6:01 PM
నల్లగొండ : తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.ఆర్ మీనా జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు వాటిని జియో ట్యాగ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి పంపించాలన్నారు. ఎక్కడైనా మొక్కలు చనిపోయినట్లయితే అక్కడ మళ్లీ మొక్కలు నాటి వాటికి ఫెన్సింగ్, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు సేకరించాల్సిన భూములను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 4.80 కోట్ల నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 2.34 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. 18,064 మైక్రో ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లు వివరించారు. జిల్లాలో 10 రోజులుగా వర్షాలు బాగా కురుస్తున్నందున హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేశామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎ.కె జా, జిల్లా నుంచి హరితహారం ప్రత్యేక అధికారి పరై్గన్, ఏజేసీ వెంకట్రావ్, డీఆర్వో రవి, డీఎఫ్‌ఓ టెరిటోరియల్ మధుసూదన్‌రెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement