20 ఏళ్లలో 10 శాతం అడవులు మాయం | 10 per cent of the forests in the 20-year-old ate | Sakshi
Sakshi News home page

20 ఏళ్లలో 10 శాతం అడవులు మాయం

Published Tue, Sep 13 2016 12:46 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

20 ఏళ్లలో 10 శాతం అడవులు మాయం - Sakshi

20 ఏళ్లలో 10 శాతం అడవులు మాయం

భూమ్మీద ఏటికేడాదీ పచ్చదనం కరువవుతోంది.. మనిషి అడుగు పెట్టని అడవుల శాతం నానాటికీ తగ్గిపోతోంది. గత 20 ఏళ్లలో భూమ్మీద ఉన్న నిర్జన అటవీ ప్రాంతం విస్తీర్ణం దాదాపు 10 శాతం అంటే దాదాపు 12.7 లక్షల చదరపు మైళ్లు తగ్గిపోయినట్లు వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ తేల్చింది. ఇలా నష్టపోయిన అటవీ ప్రాంతంలో అత్యధికం ఆఫ్రికా, అమెజాన్‌లలోనే ఉందని ఆ సంస్థ తమ అధ్యయనంలో గుర్తించింది.

ప్రస్తుతం భూమ్మీద మనిషి ప్రభావం పెద్దగా లేని భూభాగం విస్తీర్ణం కేవలం 23.2 శాతమేనని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ తెలిపారు. నిర్జన అటవీ ప్రాంతాన్ని మళ్లీ సృష్టించడం అసాధ్యమని.. మొక్కలు నాటినంత మాత్రాన అడవులను, వాటిలో ఉండే పర్యావరణ వ్యవస్థల పునఃసృష్టి జరగదని స్పష్టం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రకృతిలో మిగిలి ఉన్న అతికొద్ది నిర్జన ప్రాంతాలనూ కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement