మొక్కలు నాటి సంరక్షించాలి
మొక్కలు నాటి సంరక్షించాలి
Published Wed, Aug 3 2016 10:25 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ క్రైం
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ మండలంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, బెటాలియన్స్ డీజీ (గ్రేగ్రౌండ్స్, అక్టోపస్) గోవింద్‌సింగ్, బెటాలియన్‌కమాండెంట్ బాపూజీరావు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోతులకు సరిపడా ఆహారం దొరకకనే అడవిని వీడి గ్రామాల్లోకి ఎగబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు మొక్కలు నాటి పెంచితే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని అన్నారు. ఆనాడు అశోక చక్రవర్తి మొక్కలు నాటి ప్రజలకు ఫల సహాయాన్ని, జంతుజీవాలకు ఆహారాలను అందించేందుకు మొక్కల పెంపకం చేపట్టారని అన్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నందున ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్ష్యాన్ని చేరుకునే విధంగా మొక్కలు నాటి పెంచాలని సూచించినట్లు తెలిపారు. 2 సంవత్సరాలు నాటిన మొక్కలను కాపాడితే జీవిత కాలం ప్రజలను మొక్కలు కాపాడతాయన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పండ్ల మొక్కలను అడుగుతున్నారని, వారి విజ్ఞప్తి మేరకు పండ్ల మొక్కలను పంపిణీచేస్తామని అన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు పుష్కరాల తరువాత కూడా మొక్కలు నాటుతామని అన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ హరితహారం జయప్రదంగా నిలుస్తుందన్నారు. హోమంత్రి నాయిని నర్సింహరెడ్డి బెటాలియన్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, నల్లగొండ, నార్కట్‌పల్లి ఎంపీపీలు దైద రజితావెంకటరెడ్డి, రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, తహసిల్దార్ రాజు, ఎంపీడీవో సత్తమ్మ, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, స్థానిక సర్పంచ్ ఏదుళ్ల పుష్పలత, ఎంపీటీసీ పొగాకు అండాలు ఘట్టయ్య, సర్పంచ్‌లు అయ్యాడపు ప్రకాశ్‌రెడ్డి, పనస శంకర్‌గౌడ్, అమృత సురేందర్, ఎంపీటీసీలు శంకర్, పార్టీ మండల అధ్యక్షుడు బకరం వెంకన్న, భిక్షం, పనస శ్రీను, అమృతారెడ్డి తదితరులున్నారు.
Advertisement
Advertisement