ఆధునికత దిశగా అడుగులు | Towards modernity | Sakshi
Sakshi News home page

ఆధునికత దిశగా అడుగులు

Published Fri, Aug 26 2016 7:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

ఆధునికత దిశగా అడుగులు

ఆధునికత దిశగా అడుగులు

పులివెందుల రూరల్‌ :
ప్రతి విద్యార్థిని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించే అధ్యాపకులు తప్పనిసరిగా ఆధునిక టెక్నాలజీ వైపు అడుగులు వేయాలని అనంతపురం జెఎన్‌టీయూ వైస్‌ చాన్సలర్‌ ఎం.ఎం.ఎం.సర్కార్‌ సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఈఈఈ విభాగంలో ‘‘వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ అడ్వాన్స్‌మెంటు యూజింగ్‌ టాల్స్‌’’ అనే అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి వర్క్‌షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన శోధకులు, అధ్యాపకులు నిత్య విద్యార్థులేనన్నారు. కావున అధ్యాపకులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు కనుగొని వాటిని విద్యార్థులకు తెలియజేయాలన్నారు.

జాతీయస్థాయి వర్క్‌షాపులలో ఎన్నోతెలియని విషయాలు తెలుసుకొని వాటిని విద్యార్థులకు అందించాలన్నారు. ప్రస్తుతం ఐవోటీ(ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌), ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు మానవ జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. కావున వీటికి ఎంతో ఆవశ్యకత ఉందని వివరించారు. కళాశాల ప్రిన్సిపల్‌ గోవిందరాజులు మాట్లాడుతూ కళాశాలలో అధ్యాపకులకు టెక్విప్‌ నిధులతో ఇలాంటి జాతీయస్థాయి వర్క్‌షాపులను ప్రతినెలా నిర్వహిస్తున్నామన్నారు. కావున వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ సుబ్బారెడ్డి, ప్రొగ్రాం కన్వీనర్‌ చంద్రమోహన్‌రెడ్డి, కళాశాల ప్లేస్‌మెంటు అధికారి అపర్ణ, హైదరాబాద్‌కు చెందిన కోరిన్‌ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ జోనల్‌ మేనేజర్‌ రమేష్‌నాయుడు, ట్రై నీ స్పెషలిస్ట్‌ ప్రకాష్, రాయలసీమతోపాటు నెల్లూరు, బెంగుళూరు, హైదరాబాద్‌లకు చెందిన అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement