
కుదుపు!
పదోన్నతులు పొందిన 9 మంది సహా 16 మందికి స్థాలచలనం రెవెన్యూ ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది.
♦ క్లియరెన్స్ కోసం ఈసీకి జాబితా
♦ పదోన్నతులు పొందిన 9 మంది
♦ సహా 16 మందికి స్థాలచలనం
రెవెన్యూ ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం బదిలీల క్రతువును పూర్తి చేసిన కలెక్టర్ రఘునందన్‌రావు.. జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుండడంతో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో మార్పులు, చేర్పులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీల్డ్ కవర్‌లో బదిలీల జాబితాను ఈసీకి నివేదించింది.
భారీగా తహసీల్దార్ల బదిలీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తూ తహసీల్దార్లుగా ఇటీవల పదోన్నతులు పొందిన తొమ్మిది మందిని జిల్లాకు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే రిపోర్టు చేసిన వీరికి పోస్టింగ్‌లు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అలాగే పాలనా సౌలభ్యంలో భాగంగా అంతర్గత సర్దుబాట్లు చేసుకోవాలని భావించింది. యాలాల, బషీరాబాద్, మోమిన్‌పేట, బ ంట్వారం మండలాల్లో ప్రస్తుతం తహసీల్దార్లు లేరు. అలాగే కలెక్టరేట్‌లోని సీ, డీ సెక్షన్ సూపరింటెండెంట్ పోస్టులు సహా ఏఓ (భూ సంస్కరణలు) కుర్చీలు ఖాళీగా ఉన్నాయి.
ప్రస్తుతం కలె క్టరేట్ లో పనిచేస్తున్నఏఓ జనార్దన్ దేవాదాయశాఖలో పనిచేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈయనను జిల్లా యంత్రాంగం రిలీవ్ చేయాల్సివుంది. మరోవైపు రాజేంద్రనగర్, మల్కాజిగిరి డివిజన్ ఏఓ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా భర్తీ చేయాల్సివుంది. పదోన్నతులతో జిల్లాకు వచ్చిన 9 మందికి పోస్టింగ్‌లు ఇవ్వడమేకాకుండా.. అంతర్గతంగా మరో ఆరేడుగురికి స్థానభ్రంశం కలిగించారు. మొత్తమ్మీద తాజా బదిలీల్లో 16 మందికి స్థానచలనం కలిగే అవకాశముందని తెలిసింది. కాగా, నేడో, రేపో ఈసీ నుంచి క్లియరెన్స్ రాగానే బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
ఎంపీడీఓల బదిలీలపై కేటీఆర్‌కు లేఖ
మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీఓ) బదిలీలకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలంగా ఒకేచోట తిష్టవేసిన ఎంపీడీఓలను ట్రాన్స్‌ఫర్ చేయాలని కొంతకాలంగా జిల్లా పరిషత్ యంత్రాంగం అనుకుంటోంది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, ఎంపీడీఓల లాబీయింగ్‌తో ఈ ప్రక్రియకు తరుచూ బ్రేక్ పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా బదిలీల పర్వాన్ని పూర్తి చేయాలని నిర్ణయించిన యంత్రాంగం... 14 మంది ఎంపీడీఓలకు స్థానచలనం కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధార ణ బదిలీలపై నిషేధం ఉన్న క్రమంలో అనుమతి కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావుకు లేఖ రాసింది. పనితీరు, సమర్థతను పరిగణనలోకి తీసుకోని పోస్టింగ్‌లను ఖరారు చేసినట్లు తెలిసింది. చాలావర కు స్థానిక ప్రజాప్రతినిధుల అభ్యర్థనల ఆధారంగా బదిలీల ప్రక్రియ చేపటినట్లు ప్రచారం జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే జాబితాకు అనుగుణంగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం.