బుడ్డా వెంగళరెడ్డికి ఘన నివాళి
కర్నూలు(అర్బన్): తీవ్ర కరువు కాటకాల్లో నాలుగేళ్లపాటు అన్నదానం, గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంత వాసుల ఆకలి తీర్చిన కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళ్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం జిల్లా రెడ్డి యువజన సంఘం, రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. కర్నూలు గణేష్ నగర్‌లో ఏర్పాటు చేసిన 116వ వర్ధంతి సభలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దొనపాటి ఎల్లారెడ్డి, వంగాల భరత్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక గణేష్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి నరసింహారెడ్డి, వన్నూర్‌రెడ్డి మాట్లాడుతూ బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, ప్రభుత్వ పథకాలను ఆయన పేరుతో అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు విక్రమ సింహారెడ్డి, లోకేష్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, యువజన సంఘం నాయకులు బిర్రు ప్రతాపరెడ్డి, హేమలతారెడ్డి, పెరుగు చంద్రమోహన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, సంపతి లక్ష్మికాంతరెడ్డి, సర్వేశ్వరరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, మోహన్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.