వ్యాన్‌ డ్రైవర్‌కు రెండేళ్ల జైలు | two years jail to van driver | Sakshi
Sakshi News home page

వ్యాన్‌ డ్రైవర్‌కు రెండేళ్ల జైలు

Published Thu, Oct 6 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

two years jail to van driver

ఉంగుటూరు : చేబ్రోలు గేటు వద్ద గతంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ డ్రైవర్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు చేబ్రోలు ఎస్సై చావా సురేష్‌ చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. 2013 జనవరి 31న గుంటూరు నుంచి సరుకుల లోడుతో విశాఖ వెళ్తున్న వ్యాన్‌ చేబ్రోలు గేటు వద్ద ఆగిన ఉన్న లారీని ఢీకొంది. దీంతో వ్యాన్‌లో ఉన్న ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. 9 మంది గాయపడ్డారు. కేసులో వాదోపవాదాల అనంతరం  తాడేపల్లిగూడెం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మేజి స్ట్రేట్‌ ఎన్‌.శ్రీనివాసరావు వ్యాన్‌ డ్రైవర్‌ బి.ఎస్‌.ఎస్రా అహ్మద్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. అహ్మద్‌ది చిత్తూరు జిల్లా పలమనేరు.
 

Advertisement

పోల్

Advertisement