కడప కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మహిళలకు, విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగదని వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా తెలిపారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకొని ఏడాది పూర్తయినా ఈ ప్రభుత్వం వారి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ పరిధిలోకి తేవాలని అన్ని విద్యార్థి సంఘాలు, ఆమె తల్లిదండ్రులు పదేపదే డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
రిషితేశ్వరికి న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు గొంతెత్తి అరిచినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, ఈ కేసులో దోషులు బెయిల్‌పై స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఇప్పటికీ ర్యాగింగ్ అనే రాక్షస భూతం పెట్రేగుతూనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు జరుగు వెంకట రమణారెడ్డి, కేశవ, అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం
Published Sat, Jul 16 2016 8:08 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement