వడ్డాది వెంకన్న గిరి ప్రదక్షిణకు శ్రీకారం | vaddadi venkanna giri pradakshina Preparations | Sakshi
Sakshi News home page

వడ్డాది వెంకన్న గిరి ప్రదక్షిణకు శ్రీకారం

Published Tue, Aug 16 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

vaddadi venkanna giri pradakshina Preparations

బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. సింహాచలంలో మాదిరిగా గిరిజాంబ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి నిర్ణయించారు. అందులో భాగంగా వేంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ రోడ్డు నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. ఆలయం చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర తుప్పలు, డొంకలను పొక్లెయిన్‌తో తొలగిస్తున్నారు. గుడి మెట్ల వద్ద పనులు ప్రారంభించారు. పది రోజుల్లో కొండ చుట్టూ రోడ్డు పోల్చడానికి, మొక్కలు పెంచేందుకు, సిమెంట్‌ రోడ్డు వేసేందుకు అధికారులు, నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. రహదారి నిర్మాణం అనంతరం గిరి ప్రదక్షిణకు తేదీ ప్రకటిస్తామని, ఏటా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement