వనం–మనం సామాజిక బాధ్యత | vanam-manam social responsibility | Sakshi
Sakshi News home page

వనం–మనం సామాజిక బాధ్యత

Published Tue, Jul 26 2016 8:23 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

వనం–మనం సామాజిక బాధ్యత - Sakshi

వనం–మనం సామాజిక బాధ్యత

ఏలూరు (మెట్రో):వనం– మనం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తేదీన కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్పరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.  జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో వనం–మనం కార్యక్రమం ద్వారా ఈ నెల 29వ తేదీన 12 లక్షలు మొక్కలు నాటుతున్నామని, ప్రతి మండలం నుంచి 20 నుంచి 25 వేల వరకు మొక్కలు నాటేలా కార్యచరణ సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కాన్పరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ పీ.కోటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసులు, డీఎఫ్‌ఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement