ఇరాక్‌లో విశాఖ వాసి మృత్యువాత | Visakhapatnam district man died in Iraq | Sakshi

ఇరాక్‌లో విశాఖ వాసి మృత్యువాత

Published Fri, Mar 25 2016 11:03 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Visakhapatnam district man died in Iraq

గాజువాక: విశాఖ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం ఇరాక్ వెళ్లి మృత్యువాతపడ్డాడు. గాజువాకకు చెందిన నక్కా అప్పారావు, నాగమణి దంపతుల కుమారుడు జగదీశ్వర్‌రావు(25) రెండు నెలల క్రితం ఉపాధి కోసం ఇరాక్ వెళ్లాడు. అక్కడ ఓ ఇకా అనే ఓ కంపెనీలో వెల్డర్‌గా బాధ్యతలు చేపట్టాడు. మంగళవారం రాత్రి క్రేన్‌పెకైక్కి పనులు చేసి, కిందికి వస్తుండగా క్రేన్ కూలటంతో కిందపడి చనిపోయాడు. 

అతడు డ్యూటీ నుంచి తిరిగి గదికి రాకపోవటంతో తోటి వారు కంపెనీ నిర్వాహకులను అడిగారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవటంతో ఆందోళనకు దిగారు. దీంతో దిగివచ్చిన యాజమాన్యం అతడు ప్రమాదవశాత్తు చనిపోయాడని వెల్లడించింది. ఈ మేరకు వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. స్వదేశానికి మృతదేహాన్ని తెచ్చేందుకు 15 రోజుల సమయం పడుతుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement