విజయఢంకా మోగించిన నంది బ్రీడింగ్ బుల్స్
Published Mon, Jan 30 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామంలో నాలుగురోజులుగా నిర్వహిస్తున్న ఎడ్లపోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామ రైతు రామకోటయ్యకు చెందిన కావ్యనంది బ్రీడింగ్ బుల్స్ 5760 అడుగుల దూరం బండలాగి విజయఢంకా మోగించి ప్రథమ బహమతి గెలుచుకున్నాయి. అందుకుగాను రూ.25 వేల నగదును తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి నలజాల సదాశివరావు, మండలపార్టీ అధ్యక్షుడు కూరపాటిసైదా అందచేశారు. అదేవిధంగా శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామానికి చెందిన మారిసెట్టి మాధవి ఎడ్లు 5250 దూరం బండలాగి ద్వితీయబహుమతి రూ.20 వేలు గెలుచుకున్నాయి. కొండవీటి శ్రీనిసరావు, నలజాల కోటేశ్వరరావు, అనుముల వెంకట్రామిరెడ్డి ఈ బహుమతి అందచేశారు. ప్రత్తిపాడు గ్రామం కాకాని వెంకట్రామయ్య మొమోరియల్స్, కాకానిశ్రీహరిరావు ఎడ్లు 4500 అడుగుల దూరం బండలాగి మూడవ బహుమతి రూ.15వేలు గెలుచుకున్నాయి. బండారు మైసూరుబాబు, కాండ్రుసాంబయ్య ఈ బహుమతి అందచేశారు. నారాకోడూరు గ్రామానికి చెందిన వెలగా అనూరాధ, దుర్గి గ్రామానికి చెందిన కె.వి.నాయుడు కంబైన్స్ ఎడ్లు 4359 అడుగుల దూరం బండలాగి నాల్గవ బహుమతి రూ.10వేలు గెలుచుకున్నాయి. దొడ్లేరు పెట్రోల్‌బంకు నిర్వహకులు అమీనాహేస్సేన్ ఈ బహుమతి అందచేశారు. కొత్తపాలెం మండలం ఆకురాజుపల్లె గ్రామానికి చెందిన యామిని మోహన్‌శ్రీ, కళ్లంవారిపాలెం గ్రామానికి బద్దిగం సుబ్బారెడ్డి కంబైన్స్ ఎడ్లు 3610 దూరం బండలాగి ఐదోబహుమతి ఆరువేల రూపాయలు గెలుచుకున్నాయి. షేక్ ఖాశిమిల్లి జ్ఞాపకార్థం మనవడు గుత్తికొండ ఖాజామొహిద్దీన్ ఈ బహుమతి అందచేశారు.
Advertisement