వాలీబాల్‌ విజేత సిద్ధార్థ కళాశాల | volley ball champians siddhartha college team | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ విజేత సిద్ధార్థ కళాశాల

Published Sat, Nov 12 2016 7:04 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

వాలీబాల్‌ విజేత సిద్ధార్థ కళాశాల

వాలీబాల్‌ విజేత సిద్ధార్థ కళాశాల



మచిలీపట్నం :  అంతర్‌ కళాశాలల పురుషుల వాలీబాల్‌ పోటీలలో విజయవాడ పీబీ సిదార్ధ కళాశాల ప్రధమస్థానాన్ని సాధించింది. రెండు రోజులుగా కృష్ణా యూనివర్సిటీలో జరుగుతున్న అంతర్‌ కళాశాలల పురుషుల వాలీబాల్‌ పోటీలు శనివారంతో ముగిశాయి. ద్వితీయ స్థానంలో గుడివాడ ఏఎన్‌ఆర్‌ కళాశాల, విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాల తృతీయ స్థానం, ఏఈఅండ్‌ ఎస్‌జీ కళాశాల నాల్గవస్థానంలో నిలిచాయి. వాలీబాల్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు డిసెంబరు 2 నుంచి 7వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కొట్టాయంలో జరిగే సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ మెన్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొంటారని యూనివర్సిటీ వీసీ ఎస్‌ రామకృష్ణారావు తెలిపారు. ఈ పోటీలను యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డ్‌ కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, కో–ఆర్డినేటర్‌ జయశంకరప్రసాద్, రిజిష్ట్రార్‌ డి సూర్యచంద్రరావు పర్యవేక్షించారు.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement