చెల్లిని చంపిన అక్క అరెస్టు | woman arrest for her sister murder case | Sakshi
Sakshi News home page

చెల్లిని చంపిన అక్క అరెస్టు

Published Fri, May 19 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

woman arrest for her sister murder case

బత్తలపల్లి (ధర్మవరం) : బత్తలపల్లి వడ్డెర కాలనీలో ఈ నెల 15న అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన గౌరి అనే బాలిక కేసులో ఆమె అక్క భవానీని శుక్రవారం అరెస్టు చేసినట్లు ధర్మవరం రూరల్‌ సీఐ శివరాముడు తెలిపారు. కాలనీకి చెందిన సన్న పెద్దన్న చిన్న కుమార్తె గౌరీని ఇంటిలో ఎవరూ లేని సమయంలో పెద్ద కుమార్తె భవానీ కత్తితో పొడిచి, ఇనుపరాడ్డుతో బాది చంపిందని వివరించారు. ఈ విషయాన్ని భవాని బత్తలపల్లి వీఆర్‌ఓ పెద్దన్న ఎదుట అంగీకరించి, తమకు లొంగిపోయిందన్నారు. నిందితురాలిని కోర్టులో హజరుపరచగా రిమాండ్‌కు జడ్జి ఆదేశించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement