gowri
-
ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుతున్న.. 'గౌరి మినోచా'
'నవతరం ఆలోచనలు సృజనాత్మకంగానే కాదు జనంతో మమేకం అయ్యే విషయాలపట్ల అవగాహనతోనూ ఉంటున్నాయనడానికి ఉదాహరణ గౌరీ మినోచా. ఢిల్లీ వాసి అయిన గౌరి ఆర్ట్ సైకోథెరపీతో భవిష్యత్తును తీర్చుదిద్దుకుంటున్న వర్ధమాన కళాకారిణి. అభిరుచితో నేర్చుకున్న పెయింటింగ్ ఆర్ట్, చదువుతో ఒంటపట్టించుకున్న సైకాలజీ ఈ రెండింటి కాంబినేషన్‌తో రిలాక్సేషన్ టెక్నిక్స్ కనుక్కుంది. ఈ శైలిలోనే వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ స్కూల్, కాలేజీ పిల్లల మానసిక ఒత్తిడులను దూరం చేస్తుంది. ఆర్ట్ సైకోథెరపీతో ప్రజాదరణ పొందుతూ ఈ తరానికి కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. తను ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావిస్తూ..' ‘‘కళ–మనస్తత్వ శాస్త్రం రెండూ హృదయానికి దగ్గరగా ఉంటాయి. నేను ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో సైకాలజీ బిఏ ఆనర్స్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాను. పన్నెండవ తరగతిలో 99 శాతం మార్కులు రావడంతో సైకాలజీని ఎంచుకున్నాను. ఢిల్లీలో ఆర్ట్ సైకోథెరపీ సెంటర్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాను. కళ – మనస్తత్వ శాస్త్రం రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లు. ఆర్ట్ సైకోథెరపీలో... డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు పెయింటింగ్స్ వేసి వారికి ఇస్తుంటాను. వారి చేత కూడా రంగులతో నచ్చిన అంశాన్ని ఎంచుకొని చిత్రించమని అడుగుతాను. వారికి ఏమీ రాకపోవచ్చు. కానీ ఈ విధానం ద్వారా వారిలో నిరాశ, ఆందోళన స్థాయులను చెక్ చేస్తాను. ఇదొక రిలాక్సేషన్ టెక్నిక్. విదేశాలలో చాలా ప్రసిద్ధి చెందినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ అంత ప్రజాదరణ పొందలేదు. దీనికి కొన్ని స్కూళ్లు, కాలేజీలను ఎంచుకొని ఉచితంగా వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటాను. చిన్ననాటి నుంచి.. మా అమ్మ ఆర్టిస్ట్. వ్యాపారవేత్త కూడా. ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతోంది. ఇందులో అనేకమంది ప్రసిద్ధ కళాకారుల పెయింటింగ్ ప్రదర్శనలు జరుగుతాయి. ఆమె పిల్లలకు, పెద్దలకు పెయింటింగ్ క్లాసులు కూడా తీసుకుంటుంది. రంగులు, చిత్రాలు, కళాకారుల మధ్య నా బాల్యం గడిచింది. అలా నాకు చిత్ర కళ పట్ల అభిరుచి పెరిగింది. ఒకసారి ఎమ్ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అతని గుర్రపు పెయింటింగ్‌ను కాపీ చేశాను. అమ్మ నాలో ఉన్న ఆర్టిస్ట్‌ను గుర్తించి, సహకరించింది. ఈ కళలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. కళతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నాను. ఒత్తిడి లేకుండా చదువు.. నేను క్లాస్‌రూమ్‌లో కంటే ఆర్ట్ రూమ్‌లో ఎక్కువ సమయం గడిపాను. కానీ, నా చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాలేజీ స్థాయికి వచ్చాక ఆర్ట్ నీ సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి స్టూడెంట్‌లాగే నేనూ నా కెరియర్ గురించి తీవ్రంగా ఆలోచించాను. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్‌లో చేయాలా, సైకాలజీలో ఏ సబ్జెక్ట్ చేయాలో అర్థం కాక కొన్నిరోజులు మథనపడ్డాను. కానీ, ఆర్ట్ నా అభిరుచి, కెరియర్ సైకాలజీ రెండింటిలోప్రావీణ్యం సాధించాలనుకున్నాను. పగలు కాలేజీ, రాత్రి సమయంలో ఎంతసేపు వీలుంటే అంత టైమ్ పెయింటింగ్ చేస్తుంటాను. వ్యాపారంలోనూ నైపుణ్యం.. స్కూల్ ఏజ్ నుంచే నా పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసే దాన్ని. మొదటి పెయింటింగ్‌కు ఐదు వేల రూపాయలు వచ్చాయి. మొదట్లో నా పెయింటింగ్స్‌ని బంధువులందరికీ పంపాను. తమ ఇంట్లో పెయింటింగ్స్ అలంకరించినప్పుడు వారి ఇళ్లకు వచ్చిన బంధువులు ఆ పెయింటింగ్స్ చూసి తమకూ పంపమని కాల్స్ చేయడంప్రారంభించారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి నా పెయింటింగ్స్ అమెరికా, లండన్, ముంబై, ఢిల్లీ సహా అనేకప్రాంతాలకు చేరాయి. ఈ రోజు ఢిల్లీని ఆర్ట్ హబ్‌లో నా 12 పెయింటింగ్స్‌లో 9 అమ్మకానికి ఉన్నాయి. ప్రతి కళాకారుడు తన సొంత మార్కెట్ విలువను సృష్టించుకోవడం, ప్రచారం కూడా ముఖ్యం. సృజనాత్మకతతోపాటు వ్యాపారంలో కూడా నైపుణ్యం సాధించాలి’’ అంటూ నవతరానికి బిజినెస్ టెక్నిక్స్ కూడా చెబుతుంది గౌరి మినోచా. ఇవి చదవండి: WPL 2024: తొలి మహిళా క్యూరేటర్ జసింత -
నాటి ‘భగీరథుడు’ నేడు ‘గౌరి’ రూపంలో వచ్చాడా?
మహిళలు.. పురుషుల కంటే తక్కువని ఎవరన్నారు?.. ‘గౌరి’ గురించి తెలిస్తే ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఇక జన్మలో ఎప్పటికీ స్త్రీలను తక్కువగా చూడరు. నింగినున్న గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని గురించి మనకు తెలుసు. కొండను తవ్వి రోడ్డును వేసిన బీహార్‌కు చెందిన దర్శత్ మాఝీ గురించి కూడా మనం వినేవుంటాం. అంతటి స్థాయిని దక్కించుకున్న ‘గౌరి’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన ‘గౌరి’ నీటి ఎద్దడిని పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది. స్థానికులు ఆమెను అపర భగీరథ అని అభివర్ణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ అంగన్వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది. గౌరి చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వే పనిని వారం రోజుల క్రితం ప్రారంభించింది. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తోంది. పలుగు, పార, బుట్ట, తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె మట్టిని బయటకు తోడుతోంది. అంగన్ వాడీకి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని ‘గౌరి’ లక్ష్యంగా పెట్టుకుంది. బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి గౌరి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ‘గణేష్ నగర్లో నీటి కొరత ఉంది. అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు తాగునీరు లేదు. దాహం తీర్చుకునేందుకు పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితే నాలో బావులు తవ్వేందుకు ప్రేరణ కల్పించింది’ అని పేర్కొంది. గౌరి బావిని తవ్వడం ఇదేమీ మొదటి సారికాదు. 2017, 2018లో రెండు బావులు తవ్వింది. జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి మంచి పని చేస్తోంది. -
సుప్రీంలో ఊరట.. జడ్జిగా గౌరీ ప్రమాణం
సాక్షి, ఢిల్లీ: మద్రాస్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా లాయర్ లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొలీజియంలో చర్చ జరిగాకే ఆమె పేరు ప్రతిపాదించినట్టు పేర్కొంది. సంబంధిత హైకోర్టు జడ్జిల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లు తేలినా లేదా ప్రమాణానికి లోబడి విధులను నిర్వర్తించకున్నా రెండేళ్ల తర్వాత ఆమె పనితీరు సంతృప్తికరమని భావిస్తేనే శాశ్వత జడ్జిగా ప్రతిపాదించే అవకాశం కొలీజియంకు ఉందని గుర్తు చేసింది. గతంలో అడిషనల్ జడ్జిలుగా పనిచేసిన వారు శాశ్వత జడ్జీలు కాలేకపోయిన ఘటనలు అనేకం ఉన్నాయంది. ఒక వ్యక్తి రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలు ఆ వ్యక్తి పేరును జడ్జిగా సిఫారసు చేయకపోవడానికి కారణం కాదని కొలీజియం భావించిందని పేర్కొంది. గౌరి మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ కొందరు లాయర్లు కేసు వేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే... మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుకు ముందే మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా గౌరి ప్రమాణం చేశారు! తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజా మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో ఆమెతో ప్రమాణం చేయించారు. తనకు గొప్ప అవకాశమిచి్చన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా ఇతర న్యాయమూర్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1973లో జని్మంచిన గౌరి, 1995లో లాయర్‌గా పేరు నమోదు చేయించుకున్నారు. మదురై బెంచ్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా 2022 నుంచి పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం జనవరి 17వ తేదీన గౌరితో కలిపి మొత్తం ఐదు పేర్లను హైకోర్టు జడ్జీలుగా నియమించేందుకు కేంద్రానికి సిఫారసు చేసింది. -
మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం..
న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియమిస్తూ కేంద్రం నోటిఫై చేయడంపై వివాదం చెలరేగింది. ఆమెను జడ్జిగా సిఫారసు చేసిన కొలీజియం నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విక్టోరియా గౌరి గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ముస్లింలు, క్రైస్తువులపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మొదట వచ్చేవారం విచారణ చేపడతామన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఆ తర్వాత ఈ పిటిషన్‌పై ఈనెల 10న(శుక్రవారం) విచారణ జరుపుతామని చెప్పారు. విక్టోరియా గౌరికి హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించడాన్ని కొంతమంది మద్రాస్ హైకోర్టు లాయర్లు ఇప్పటికే వ్యతిరేకించారు. ఆమెను జడ్జిగా నియమించవద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు కొలీజియాన్ని కోరారు. ఈమె జడ్జి అయితే ముస్లింలు, క్రైస్తవులకు తమకు న్యాయం దక్కుతుంది అనే నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించారు. న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియానికి కేంద్రానికి మధ్య మాటల యుద్ధం జరిగిన సమయంలో విక్టోరియా గౌరి పదోన్నతి సాఫీగా జరిగిపోయిందని పలువురు విమర్శలు గుప్పించారు. చదవండి: ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు -
డప్పు కొట్టి చెబుతా!
ఆడపిల్ల ఇది చేయకూడదు. అది చేయకూడదు. ఇలా ఉండకూడదు.. అలా ఉండకూడదు అనే హద్దులు ఈ నవీన సమాజంలోనూ ఇంకా సమసిపోలేదు. అలాంటిది ఓ ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పనవసరం లేదు. సవాలక్ష కట్టుబాట్లు, అనేకమైన ఆంక్షలు, అయినవాళ్లెవరూ ఆదుకోని పరిస్థితుల్లో కుటుంబాన్ని బతికించుకోవడం కోసం బుర్రకథ కళాకారిణిగా మారిందో అబల. పదకొండేళ్ల వయసులోనే బుర్రకథ ప్రవచనకర్తగా బతుకు పోరాటం మొదలుపెట్టి డప్పు వాయించడం తప్పనిసరి కావడంతో దానినీ నేర్చుకుని నాలుగొందల ప్రదర్శనలిచ్చిన ఆమె తనలాంటి ఎంతోమంది యువతులకు ఆదర్శం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని డప్పు వాయించి మరీ చెబుతా అంటున్న ఈ గౌరి కథ ఆమె మాటల్లోనే... నా పేరు కొట్యాడ గౌరి.. మాది లక్కవరపుకోట మండలం కొట్యాడ తలారి గ్రామం. నాకు 8 ఏళ్ళ వయస్సున్నప్పుడే అనారోగ్య కారణంగా నాన్న చనిపోయారు. అమ్మ, మేము ఇద్దరు అక్కచెల్లెళ్లం, ఒక తమ్ముడు ఉన్నాం. నేను రెండోదాన్ని. అమ్మకు వ్యవసాయపనులు ఏమీ రావు. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. అక్క కూలీపనికి వెళ్లితెచ్చిన డబ్బులతోనే అందరం బతకాలి. అక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలు నా భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. ఏడవ తరగతితో చదువు ఆపేసి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో కాలం గడిపేవాళ్లం. ఆ సమయంలో ఓ పెద్దాయన బుర్రకథ చెప్పమని నన్ను ప్రోత్సహించాడు. ఇంటి పరిస్థితుల కారణంగా అమ్మ కూడా అదే మంచిదనుకుంది. అలా బుర్రకథ బృందంలో ప్రవేశించాను. జట్టేడివలస గ్రామానికి చెందిన కెళ్ల సింహాచలం అనే బుర్రకథ మాష్టారి వద్ద శిష్యరికం చేసి 1998లో వచనకర్తగా మారాను. గ్రామదేవతల పండుగలకు బుర్రకథ చెప్పడానికి వెళ్తుంటాను. అందులో రామాయణం వంటి కథలు చేశాను. డప్పు వాయిస్తూ బుర్రకథ చెబుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పరుస్తూ జీవనాన్ని సాగిస్తున్నాను. బుర్రకథ దళాన్ని తయారు చేసుకుని బాల్యవివాహాలు, పావలావడ్డీ రుణాలు, ఇందిరమ్మ ఇళ్ళు వంటి వాటిపై ప్రదర్శనలు ఇచ్చాము. వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి హయాంలో కూడా నేను ఈ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన పర్చాను. బుర్రకథ చెబుతున్నప్పుడు డప్పుకూడా వాయించాల్సి వచ్చేది.దీంతో డప్పు వాయిస్తూ, స్వయంగా పాటలు పాడటం నేర్చుకున్నాను. ఇరవై ఏళ్లుగా మహారాష్ట్ర, తెలంగాణ, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాను. మహిళా కళాకారులంటే అప్పట్లో చాలామందికి చిన్నచూపు ఉండేది. పొట్టకూటి కోసం ప్రవచనం చెప్పుకుంటున్న నన్ను చాలామంది హేళన చేసేవారు. వేధించేవారు. బంధువులైతే సూటిపోటీ మాటలతో శూలాల్లా గుచ్చేవారు. అయితే ‘ఎంత కష్టం వచ్చినా దొంగతనం చేయకు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరినీ మోసం చేయకు’ అని అమ్మ నాకు చెప్పి ప్రదర్శనలకు పంపిస్తుండేది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైనా నాకు బాధ కలిగి బలహీన పడినప్పుడు అమ్మ చెప్పిన మాటలు, బంధువుల ఎత్తిపొడుపులు గుర్తుకు వచ్చేవి. అందుకే రోజు రోజుకూ నాలో కసి పెరిగింది. మంచిమార్గంలోనే ఉన్నతస్థాయికి ఎదగాలనుకున్నాను. భర్త ప్రోత్సాహం కూడా నాకు తోడయ్యింది. ఇప్పుడు నాకంటూ ప్రత్యేకంగా ఓ దళం ఉంది. నేను బతుకుతూ నాతోపాటు పదిమందిని బతికిస్తున్నాననే తృప్తి ఉంది. నిజానికి ఇప్పటికీ నా కష్టం పూర్తిగా తీరిపోలేదు. పండుగలు, జాతరలు లేనప్పుడు బుర్రకథ ప్రదర్శనలు ఉండవు. ఉన్నా దానివల్ల వచ్చే ఆదాయం కూడా ఇప్పుడున్న ఖర్చులకు సరిపోదు. అందుకే టిఫిన్ సెంటర్ లాంటిదొకటి పెట్టుకుందామని చూస్తున్నాను. రుణం కూడా మంజూరైంది. కానీ ఎందుకో ఆ సొమ్ము నా చేతికి ఇవ్వడానికి బ్యాంకువాళ్లకి మనసు రావడం లేదు. ఎప్పటికైనా వారి మనసు కరిగితే బుర్రకథ కళాకారిణిగా ఉంటూనే స్వయం ఉపాధి ఏర్పరచుకోవాలని ఉంది. దొంగతనం చేయకు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరినీ మోసం చేయకు’ అని అమ్మ నాకు చెప్పి ప్రదర్శనలకు పంపిస్తుండేది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైనా నాకు బాధ కలిగి బలహీన పడినప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి. – కొట్యాడ గౌరి – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
చెల్లిని చంపిన అక్క అరెస్టు
బత్తలపల్లి (ధర్మవరం) : బత్తలపల్లి వడ్డెర కాలనీలో ఈ నెల 15న అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన గౌరి అనే బాలిక కేసులో ఆమె అక్క భవానీని శుక్రవారం అరెస్టు చేసినట్లు ధర్మవరం రూరల్ సీఐ శివరాముడు తెలిపారు. కాలనీకి చెందిన సన్న పెద్దన్న చిన్న కుమార్తె గౌరీని ఇంటిలో ఎవరూ లేని సమయంలో పెద్ద కుమార్తె భవానీ కత్తితో పొడిచి, ఇనుపరాడ్డుతో బాది చంపిందని వివరించారు. ఈ విషయాన్ని భవాని బత్తలపల్లి వీఆర్ఓ పెద్దన్న ఎదుట అంగీకరించి, తమకు లొంగిపోయిందన్నారు. నిందితురాలిని కోర్టులో హజరుపరచగా రిమాండ్‌కు జడ్జి ఆదేశించారన్నారు. -
విషమంగా వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్ల ఆరోగ్యం
తిరుపతి: చిత్తూరు జిల్లా నగరిలో సమస్యల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోగ్యం క్షీణిస్తోంది. దీక్ష చేస్తున్న కౌన్సిలర్ గౌరీ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న ఆమె బుధవారం సాయంత్రం ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోయారు. దీంతో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఈటీటీ ప్లాంట్లను తక్షణమే ప్రారంభించాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్ష చేస్తున్న కౌన్సిలర్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో తక్షణమే సమస్యలు పరిష్కారించడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
అనకాపల్లిలో ఘనంగా సారె ఊరేగింపు
-
నువ్వు-నేను.. గౌరీ.. గోపాలం
గౌరి, మధుగోపాల్ దాంపత్యం అనే ఒకే ఫ్రేమ్‌లో ఒదిగిన రెండు చిత్రాలు వేముల గౌరి, మధుగోపాల్! గౌరి.. రేఖాచిత్రమైతే మధుగోపాల్.. ఛాయాచిత్రం! నిజంగానే ఆమెకు ఆయన నీడ. అలాగని ఆయనేమీ ఆమె చేత్తో కుంచె పట్టించి బొమ్మలు వేయడం నేర్పించలేదు. అసలామాటకొస్తే వాళ్ల పెళ్లయ్యే నాటికే ఆమె కాస్త పేరున్న ఆర్టిస్ట్. ఢిల్లీలాంటి పెద్దపెద్ద నగరాల్లో చాలా షోస్ చేసి ఉంది. మధుగోపాల్ ఇంకా స్ట్రగ్లింగ్లోనే ఉన్నాడు. గౌరికి తన సలహాలు, సూచనలు అవసరం లేదనీ ఆయనకు తెలుసు. అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండరు కదా.. ఈ పాయింటే మధుని గౌరీకి ఛాయగా నిలిపింది. ఒక ఆలోచనొచ్చిందే తడవుగా గౌరి బ్రష్ పట్టుకొని పని మొదలుపెట్టేస్తుంది. తను అనుకున్నది అనుకున్నట్టు కాన్వాస్ మీద కనిపించే దాకా కన్నెత్తి చూడదు. ఆరుగంటలైనా.. పన్నెండు గంటలైనా! తర్వాత.. పూర్తయిన ఆ బొమ్మకు ఫ్రేమ్‌వర్క్ చేసుకోవడంలో పడిపోతుంది. ఇలాంటి టైమ్‌లోనే మధు ఛాయలా అమెనంటిపెట్టుకుంటాడు. గౌరీకి కలర్స్ మీద పట్టుంది కానీ కంప్యూటర్ మీద లేదు. అది మధుకి ఉంది. అందుకే ఆమె మెయిల్ ఐడీ క్రియేట్ చేయడం దగ్గర్నుంచి మెయిల్స్ చెక్ చేయడం, రిప్లయ్ పెట్టడం, ప్రోగ్రామింగ్ షెడ్యూల్ సెట్ చేయడం.. వంటివన్నీ చేస్తాడు ఇష్టంగా! ‘తన పని తప్ప ఇంకేదీ పట్టించుకోదు. వర్క్‌ని రికార్డ్ చేసుకోవాలన్న ధ్యాసా ఉండదు. అవన్నీ నేను చేస్తుంటా’ అంటాడు ప్రేమగా. ‘అందుకే పెళ్లికి ముందు నేను చేసిన వర్క్స్ ఏవీ లేవు నా దగ్గర. ఏమున్నా పెళ్లి తర్వాత వర్క్ రికార్డే.. బికాజ్ ఆఫ్ మధు!’ అని చెప్తుంది గౌరి ఆరాధనగా! మరి మధుకి గౌరి? తోడు. మధుగోపాల్ ఫొటోగ్రాఫ్స్కి తగిన ఫ్రేమ్స్‌ని ఆమే సెలక్ట్ చేస్తుంది. ఫొటోగ్రఫీకి టెక్నికల్ వ్యవహారాలెక్కువ. ఆదాయం కన్నా ఖర్చూ ఎక్కువ. టెక్నాలజీ అప్డేట్ అయినప్పుడల్లా మధూ అప్డేట్ కావాలి. మార్కెట్లోకొచ్చిన కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలి. అలాంటప్పుడే గౌరీ.. మధుకి తోడుగా ఉంటుంది అప్పు ఇచ్చి. ‘ఫలానా టైమ్‌కల్లా తిరిగి డబ్బు తిరిగిచ్చేయాలంటాను’ అని గౌరి అంటుంటే ‘ఆ బాండ్లో ఎప్పుడూ లేను. ఆమె చెప్పిన టైమ్‌లో తిరిగిచ్చింది ఎప్పుడూ లేదు’ అంటాడు మధు నవ్వుతూ. ‘ఏం చేస్తాం.. నేను సంవత్సరమంతా పనిచేసినా సంపాదించలేనంత ఎమౌంట్‌ని ఆమె ఒక్క వర్క్‌తో గెయిన్ చేస్తుంది. ఆర్ట్ వాల్యూ అది.. ఫొటోగ్రఫి రెస్పెక్ట్ ఇలాంటిది’ కన్‌క్లూజన్ ఇస్తున్నట్టుగా మధు. ‘మా ఇద్దరి సంపాదనా ఇంటికోసమే. ఆయనకు నేనిచ్చినా.. నాకు ఆయనిచ్చినా.. ఒకటే కదా. ఫలానా టైమ్‌కల్లా ఇచ్చేయాలనే ప్రెషర్ నా డబ్బుని నేను తీసేసుకోవాలని కాదు.. ఆ వంకతో ఆయనను తన వర్క్ మీద మరింత కాన్సన్ట్రేట్ అయ్యేట్టు చేయడానికే’ అంటుంది గౌరి. ‘తను చెప్పింది నిజమే. గౌరీ ఫైనాన్షియల్లీ సౌండ్ కావడం వల్ల నాకింకో వెసులుబాటూ ఉంది. నేను బయటెక్కడో అప్పు తీసుకొని దానికి ఇంట్రెస్ట్ పే చేసే బాధా తప్పుతోంది కదా’ అంటాడు మళ్లీ నవ్వుతూ. తోడునీడలా మెలిగే ఈ అలుమగలకు ఇంకొకరి స్పేస్‌ని గౌరవించడమూ తెలుసు. సహాయం తప్ప ఇన్వాల్వ్ ఉండదు. సమాచారం ఇవ్వడం తప్ప ఇన్సిస్ట్లుండవ్. ‘ఏ ఆర్ట్‌గ్యాలరీ వాళ్లు వచ్చి మీ షో పెడతామన్నా ఠక్కున ఒప్పేసుకుంటుంది. అది ఎలాంటి గ్యాలరీ.. దాని రెప్యూటేషన్ ఏంటీ అని ఆలోచించదు. ‘తొందరపడకు. ఆ గ్యాలరీ గురించి తెలుసుకొని ఓకే చెప్పు’ అని సలహా మాత్రం చెప్తాను. డెసిషన్ తనదే’ గౌరీ కెరీర్లో తన పరిధి గురించి వివరిస్తూ మధు. ‘తను తీసిన ఫొటోగ్రఫీలో డీటేల్స్.. బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పడం తప్ప ఇంకేం ఇన్వాల్వ్కాను’ కరాఖండిగా గౌరి. అసూయలు.. అలగటాలు? ‘అస్సలుండవ్’ అంటారు ముక్త కంఠంతో. ‘ఫొటోగ్రఫి కన్నా ఆర్ట్ రిచ్. దానికున్న డిమాండ్ ఎలాంటిదో ప్రపంచానికి తెలుసు. కాబట్టి నాకు గౌరీ పనిపట్ల .. ఆమె పేరుప్రఖ్యాతుల పట్ల జెలస్లాంటిదెప్పుడూ లేదు, ఉండదు.’ అంటాడు గౌరీ పట్ల ఎంతో గౌరవంతో. ‘ఫొటోగ్రఫికి ఉన్న హద్దులు.. పరిధి నాకు ముందే తెలుసు. అయితే పెళ్లప్పటికే మధుకి ఓ స్టూడియో ఉండటం.. ఆయన పట్ల నాకు ఓ నమ్మకాన్ని కుదిర్చింది. అది వమ్ముకాలేదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అండర్ ఎస్టిమేషన్స్ లేవు కాబట్టి ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అనే అలకలకు చాన్స్ లేదు, ఉండదు’ అని చెప్తుంది గౌరి బల్లగుద్దినట్టు. ప్రతి ట్రిప్ హానీమూనే.. అండర్స్టాండిగ్కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌గా ఉండే ఈ జంట పెళ్లి వయసు పదేళ్లు. వీళ్లకు తొమ్మిదేళ్ల బాబు. పెళ్లయిన కొత్తలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే తాజాదనం వీళ్ల దాంపత్యంలో. మధు ఫొటోషూట్ కోసం ఏ టూర్‌కి వెళ్లినా వెళ్తుంది గౌరి. అక్కడ మధు కెమెరా లెన్స్‌లు అడ్జస్ట్ చేసుకుంటే గౌరి కాన్వాస్ బిగిస్తుంది. ఇది మధు.. గౌరీకిచ్చే కానుక. గౌరి.. మధుకిచ్చే బహుమతీ ఉంటుంది. తన ఆర్ట్‌ని ఇన్వైట్ చేసిన గ్యాలరీస్కి మధుని పరిచయం చేస్తుంది. ఆయన పనితనం చూసిన గ్యాలరీలు అతనికీ ఆఫర్ ఇస్తాయి. మధు ఛాయాచిత్రాలకు ఎంతలా ఇంప్రెస్ అవుతాయంటే.. తర్వాత గౌరీని కూడా మరిచిపోయేంతలా. ఇంతటి అవగాహన ఉంది కాబట్టే సక్సెస్‌గ్రాఫ్ అటూఇటైనా బ్యాలెన్స్డ్గా సాగిపోతోందీ జంట! - సరస్వతి రమ