అసౌకర్యాలతో మహిళల అవస్థలు | women suffers of non facilities | Sakshi
Sakshi News home page

అసౌకర్యాలతో మహిళల అవస్థలు

Jul 25 2016 6:10 PM | Updated on Mar 28 2018 11:26 AM

అసౌకర్యాలతో మహిళల అవస్థలు - Sakshi

అసౌకర్యాలతో మహిళల అవస్థలు

డీపీఎల్‌ క్యాంపులు నిర్వహించే చోట కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా ఆరోగ్యశాఖ అధికారుల తీరు మారటంలేదు.

ఆపరేషన్లు చేసి కింద పడుకోబెట్టిన వైద్యులు
పరిగి: డీపీఎల్‌ క్యాంపులు నిర్వహించే చోట కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో  ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా ఆరోగ్యశాఖ అధికారుల తీరు మారటంలేదు. సౌకర్యాలు కల్పించటంలో విపలమవుతూనే ఉన్నారు. దీంతో ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలకు అవస్తలు తప్పటంలేదు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన డీపీఎల్‌ (డబుల్‌ పంచర్‌ ల్యాప్రోస్కోపిక్‌) క్యాంపులో ఆపరేషన్ల కోసం వచ్చిన బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మద్యలో డీపీఎల్‌ క్యాంపు నిర్వహించటంలో జరిగిన జాప్యంతో సోమవారం నిర్వహించిన క్యాంపుకు మహిళలు ఆపరేషన్లు చేయించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారు. 136 మంది ఆపరేషన్లు చేయించుకునేందుకు తమ పేర్లను నమోదు చేసుకోగా ఆయా కారణాలతో ఇద్దరిని రిజెక్ట్‌ చేశారు. మొత్తం 134 మంది మహిళలకు వైద్యురాలు జయమాలిని వారికి ఆపరేషన్లు నిర్వహించారు. ఆస్పత్రిలో సరిపడాఇ మూత్రశాలలు కూడా లేకపోవదటంతో ఆరుబయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఆపరేషన్లు నిర్వహించాక వారిని బెడ్లపై కాకుండా ఆస్పత్రి లోపలి వరండాలో కార్పెట్లు వేసి నేలపైనే పడుకోబెట్టారు. దీంతో వారు అవస్తలు పడాల్సి వచ్చింది..ఈ కార్యక్రమాన్ని ఎస్పీహెచ్‌ఓ డాక్టర్‌ ధశరథ్‌, ఆస్పత్రి ఇంచార్జి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ లు పర్యవేక్షించారు.

Advertisement

పోల్

Advertisement