రోడ్డుపైన పిల్లలు.. నేలపైన తల్లులు | children on roads and mothers on earth | Sakshi
Sakshi News home page

రోడ్డుపైన పిల్లలు.. నేలపైన తల్లులు

Jul 31 2015 6:08 PM | Updated on Sep 3 2017 6:31 AM

రోడ్డుపైన పిల్లలు.. నేలపైన తల్లులు

రోడ్డుపైన పిల్లలు.. నేలపైన తల్లులు

కుటుంబ నియంత్రణ(కుని) ఆపరేషన్ చేయించుకున్న మహిళలను బెడ్‌లు లేకపోవటంతో నేలపైనే పడుకోబెట్టారు.

హైదరాబాద్ సిటీ: కుటుంబ నియంత్రణ(కుని) ఆపరేషన్ చేయించుకున్న మహిళలను బెడ్‌లు లేకపోవటంతో నేలపైనే పడుకోబెట్టారు. ఈ పరిస్థితి బాలానగర్‌లోని వినాయక నగర్ పీహెచ్‌సీలో నెలకొంది. కనీస సదుపాయాలు లేకపోవడంతో వారి వెంట వచ్చిన పిల్లలు రోడ్డుపైనే కూర్చోవాల్సి వచ్చింది. శుక్రవారం 60 మందికి కు.ని. ఆపరేషన్లు నిర్వహించారు. కానీ ఆరోగ్య కేంద్రంలో నాలుగు బెడ్‌లు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క బెడ్‌పై నలుగురిని పడుకోబెట్టారు. మిగతా 40 మందికి బెడ్‌లు లేకపోవడంతో నేలపైనే పడుకోబెట్టారు. ఇప్పటికైనా మెరగైన సౌకర్యాలు కల్పించాలని మహిళలు కోరుతున్నారు.

Advertisement

పోల్

Advertisement