breaking news
family planing operation
-
అసౌకర్యాలతో మహిళల అవస్థలు
ఆపరేషన్లు చేసి కింద పడుకోబెట్టిన వైద్యులు పరిగి: డీపీఎల్ క్యాంపులు నిర్వహించే చోట కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా ఆరోగ్యశాఖ అధికారుల తీరు మారటంలేదు. సౌకర్యాలు కల్పించటంలో విపలమవుతూనే ఉన్నారు. దీంతో ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలకు అవస్తలు తప్పటంలేదు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన డీపీఎల్ (డబుల్ పంచర్ ల్యాప్రోస్కోపిక్) క్యాంపులో ఆపరేషన్ల కోసం వచ్చిన బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మద్యలో డీపీఎల్ క్యాంపు నిర్వహించటంలో జరిగిన జాప్యంతో సోమవారం నిర్వహించిన క్యాంపుకు మహిళలు ఆపరేషన్లు చేయించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారు. 136 మంది ఆపరేషన్లు చేయించుకునేందుకు తమ పేర్లను నమోదు చేసుకోగా ఆయా కారణాలతో ఇద్దరిని రిజెక్ట్ చేశారు. మొత్తం 134 మంది మహిళలకు వైద్యురాలు జయమాలిని వారికి ఆపరేషన్లు నిర్వహించారు. ఆస్పత్రిలో సరిపడాఇ మూత్రశాలలు కూడా లేకపోవదటంతో ఆరుబయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఆపరేషన్లు నిర్వహించాక వారిని బెడ్లపై కాకుండా ఆస్పత్రి లోపలి వరండాలో కార్పెట్లు వేసి నేలపైనే పడుకోబెట్టారు. దీంతో వారు అవస్తలు పడాల్సి వచ్చింది..ఈ కార్యక్రమాన్ని ఎస్పీహెచ్ఓ డాక్టర్ ధశరథ్, ఆస్పత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ లు పర్యవేక్షించారు. -
రోడ్డుపైన పిల్లలు.. నేలపైన తల్లులు
హైదరాబాద్ సిటీ: కుటుంబ నియంత్రణ(కుని) ఆపరేషన్ చేయించుకున్న మహిళలను బెడ్లు లేకపోవటంతో నేలపైనే పడుకోబెట్టారు. ఈ పరిస్థితి బాలానగర్‌లోని వినాయక నగర్ పీహెచ్సీలో నెలకొంది. కనీస సదుపాయాలు లేకపోవడంతో వారి వెంట వచ్చిన పిల్లలు రోడ్డుపైనే కూర్చోవాల్సి వచ్చింది. శుక్రవారం 60 మందికి కు.ని. ఆపరేషన్లు నిర్వహించారు. కానీ ఆరోగ్య కేంద్రంలో నాలుగు బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క బెడ్‌పై నలుగురిని పడుకోబెట్టారు. మిగతా 40 మందికి బెడ్లు లేకపోవడంతో నేలపైనే పడుకోబెట్టారు. ఇప్పటికైనా మెరగైన సౌకర్యాలు కల్పించాలని మహిళలు కోరుతున్నారు.