పెద్ద ఆనపను చూపుతున్న సత్యవతి
పడి లేచిన పాదుకు పది కిలోల ఆనప
బొబ్బిలి రూరల్: అలజంగి గ్రామంలో బెవర సత్యవతి పంట పొలాల్లో ఆనప పాదు భారీ ఆనపకాయను కాసింది. పది కిలోల బరువున్న ఈ ఆనపకాయ రెండడుగులు పైగా ఎత్తు పెరిగింది. కేవలం పడి లేచిన ఈ పాదుకు భారీ కాయలు కాయడం విశేషం. పశువులపేడతో కూడిన గెత్తంలో లేచిన పాదు కావడంతో పంట దిగుబడి బాగా వస్తుందని ఏఓ ఎం.శ్యామసుందరరావు తెలిపారు.