వన్యప్రాణి సంరక్షణకు కృషి | Work for wildlife care | Sakshi
Sakshi News home page

వన్యప్రాణి సంరక్షణకు కృషి

Published Sat, Apr 22 2017 10:24 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

వన్యప్రాణి సంరక్షణకు కృషి - Sakshi

వన్యప్రాణి సంరక్షణకు కృషి

- డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌ చైర్మన్‌ అనిల్‌కుమార్
 
శ్రీశైలంప్రాజెక్టు: నాగార్జునసాగర్‌– శ్రీశైలం టైగర్‌ రిజర్వు పరిధిలో వన్యప్రాణుల సంరక్షణకు డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌( వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌) కృషి చేస్తోందని ఆసంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్ తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా తుంగుడు బావి ప్రాంతంలో సోలార్‌ పంప్‌సెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతన సాంకేతిక పరిజ్ఞానంతో డెన్మార్క్‌ దేశం నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేక సోలార్‌ పంప్‌ సెట్లను నాగార్జునసాగర్‌ – శ్రీశైలం టైగర్‌ రిజర్వులోని(ఎన్‌ఎస్‌జిఆర్‌) దట్టమైన అటవీ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్‌ఎస్‌జిఆర్‌లో 20 సోలార్‌ పంప్‌సెట్లను ఏర్పాటు చేశామన్నారు.
 
గిరిజన గూడాల్లో నివసిస్తున్న చెంచులకు కూడా మంచినీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యక్తులతో ప్రమేయం లేకుండా పనిచేసే యంత్రాలను బిగిస్తూ ఆయా ప్రాంతాలలో నీటిని సమృద్ధిగా అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అటవీశాఖ అధికారుల సమన్వయంతో డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌ పనిచేస్తోందన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా సిరిగిరిపాడులో సోలార్‌ పంప్‌సెట్‌ ఏర్పాటు చేశామని, ఆదివారం కర్నూలు జిల్లా రేగిమానుకుంటలో కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక్కొక్క యూనిట్‌ ఏర్పాటుకు సుమారు రూ. 7.5లక్షల ఖర్చు అవుతుండగా, డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌ 50శాతం, అటవీశాఖ 50 శాతం  భరిస్తోందన్నారు
 
. గిరిజనుల విద్య, వైద్యానికి కూడా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అటవీ పరిధిలోని 65 బేస్‌ క్యాంప్‌ల్లో స్వచ్ఛమైన నీటిని అందించడం కోసం ఆధునిక వాటర్‌ ఫిల్టర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.  వైల్డ్‌ లైఫ్‌ పీసీసీ ఎఫ్‌ కె ఎస్‌ రెడ్డి, ఎన్‌ఎస్‌టిఆర్‌ ఏపీ ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఎస్‌ శరవణన్, , శ్రీనివాస హ్యాచరిస్‌ సురేష్‌ రాయుడు చిత్తూరి, డాక్టర్‌ రెడ్డిస్‌ ల్యాబ్‌ జివి ప్రసాద్, ఫార్గింగ్స్‌ ఆర్‌ ఎస్‌ రెడ్డి రాచమల్లు, గాటి ట్రాన్స్‌పోర్టు లిమిటెడ్‌ మహేంద్ర అగర్వాల్, మీరా అండ్‌ సీకో పంప్స్‌ మహేష్‌దేశాయ్, ఫస్ట్‌ అమెరికన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారత దేశ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ పి రాఘవచార్యులు తదితరులు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement