- ఐఐటీ 5వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్
సంగారెడ్డి రూరల్: ఐఐటీయాన్లు తమకున్న విజ్ఞానాన్ని ఉపయోగించి సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి మండలం కందిలోని ఐఐటీలో 5వ స్నాతకోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఐఐటీ విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజానికి ఉపయోగ పడే టెక్నాలజీని రుపొందించాలన్నారు. ఐఐటీ హైదరాబాద్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీ మొహన్ రెడ్డి మాట్లాడుతూ స్నాతకోత్సవం అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైందన్నారు.
2008లో ప్రారంభమైన ఐఐటీ హైదారాబాద్ పరిశోధన రంగానికి విశేష సేవలు అందించిందన్నారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొ. దేశాయ్ మాట్లాడుతూ ఎన్‌ఐఆర్‌ఎస్‌లో ఐఐటీ హైదరాబాద్‌ను 7వ స్థానంలో నిలిపిన విద్యార్థులు, అధ్యపకుల కృషి ఎంతో గొప్పదన్నారు. అనంతరం అత్యంత ప్రతిభ కన‡బర్చిన ఐదుగురు విద్యార్థులకు బంగారు పతకాలు, మిగిలిన వారికి డీగ్రీలను అందజేశారు. కార్యాక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.