ఘనంగా లలితా పారాయణ యజ్ఞం
ఘనంగా లలితా పారాయణ యజ్ఞం
Published Wed, Aug 24 2016 5:28 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
సూర్యాపేటటౌన్ : పట్టణంలోని శ్రీసంతోషిమాత దేవాలయంలో శ్రీలలితా పారాయణ పరిషత్ ఆధ్వర్యంలో 54రోజులుగా నిర్వహిస్తున్న శ్రీలలితా పారాయణం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా శ్రీలలితా పారాయణ యజ్ఞం ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు ఇరువంటి శివరామకృష్ణశర్మ లలితా మాతకు, శ్రీలక్ష్మిగణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సుమారు 200 మంది భక్తులతో లలితా పారాయణాన్ని పఠిస్తూ శ్రీలలితా యజ్ఞం నిర్వహించారు. అనంతరం 18 రకాల వనమూలికలతో మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మండ్లపల్లి మురళీధర్, ఈగా దయాకర్, విద్యాసాగర్‌రావు, తాళ్లపల్లి రామయ్య, పాపిరెడ్డి, బెలిదె అశోక్, సురేష్, యామా వెంకటేశ్వర్లు, నూకా ముత్యాలమ్మ, నాగమణి, రత్నమాల, పద్మ, విజయలక్ష్మి, సంపత్, జగన్నాథశర్మ, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement