ఘనంగా హనుమ యాగము
ఘనంగా హనుమ యాగము
Published Tue, Jul 26 2016 6:01 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
యాదగిరిగుట్ట: స్థానిక యాదగిరి గార్డెన్స్‌లో గుళ్లపల్లి వెంకటరామ సూర్యనారాయణ ఘనాపాఠి చేపట్టిన హనుమ యాగము మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా గణపతి పూజ, యాగ సంకల్పం, కలశస్థాపన, మండపారాధన, అగ్నిప్రతిష్ఠ, సాయంత్రం స్థాపిత దేవతా హవనములు, మన్యుసూక్త హవనము, నీరాజన మంత్ర పుష్పములు నిర్వహించారు. ఉదయం జరిగిన పూజల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర, యాదాద్రి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని కోరుతూ యాగాన్ని చేపట్టినట్లు వెంకటరామ సూర్యనారాయణ తెలిపారు. ఈ పూజల్లో గుళ్లపల్లి సీతారామ ఫణికుమారశర్మ, కనకదండి శ్రీకాంత్ శర్మ, హిందుదేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి, రచ్చ యాదగిరి, రచ్చ శ్రీనివాస్, కర్రె ప్రవీణ్, గాయత్రి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement