బీబీనగర్(నల్గొండ జిల్లా): బీబీనగర్ మండలం గూడూరులో ఓ యువకుడు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తిట్టాడనే కారణంతో నరుడి వెంకటేశ్(24) అనే యువకుడు మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు సదరు వ్యక్తి ఇంటి మందు శవంతో ధర్నాకు దిగారు.