
మల్లన్నను దర్శించుకున్న వైఎస్ జగన్
కర్నూలు : వైస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం జేఈవో, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కాగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి రెండోరోజుకు చేరింది.
శ్రీశైలం నియోజకవర్గం దోర్నాలలో యాత్ర కొనసాగనుంది. ముందుగా దోర్నాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడతారు. అక్కడ నుంచి ఆత్మకూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.